Texas Shooting Spree: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

7 Dec, 2023 06:11 IST|Sakshi

ఆస్టిన్‌(అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. గతంలో జైలుకు వెళ్లొచి్చన 34 ఏళ్ల షేన్‌ జేమ్స్‌ అనే వ్యక్తి టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో నాలుగు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు అధికారులుసహా ముగ్గురు గాయపడ్డారు. నిందితుడిని కారులో వెంబడించి మరీ పోలీసులు అరెస్ట్‌చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడింటి దాకా ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. శాన్‌ ఆంటోనియో ప్రాంతంలో కాల్పులు జరిపాక 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో చోటా ఇతను కాల్పులకు తెగబడ్డాడు. ఎందుకు కాల్పులు జరిపాడు? మృతులతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ ఏడాది ఇది 42వ కాల్పుల ఘటన.

>
మరిన్ని వార్తలు