వెన్నెలకంటికి తానా అశ్రు నివాళి

7 Jan, 2021 21:20 IST|Sakshi

పాటల రచయిత వెన్నలకంటి మృతి పట్ల తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా వెన్నెలకంటి కుటుంబ సభ్యులకు తానా  ప్రగాడ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు అయన ఆత్మకు శాంతి చేకూరాలని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రకటించారు.  

డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో గత వారం డిసెంబర్ 27 న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అనే 8వ సమావేశంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, డా. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌తో పాటు అతిధిగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వెన్నెలకంటి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, తరచూ సంభాషించే ఒక మంచి రచయిత అకస్మాత్తుగా కనుమరుగై పోవడం అత్యంత విషాదకరం అన్నారు. తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని.. ఈ పరిస్థితి మారాలని అన్నారు.    

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు