యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త!

7 Feb, 2023 19:34 IST|Sakshi

యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై బ్రిటన్‌లో నివసించేందుకు స్పాన్సర్‌, జాబ్స్‌తో సంబంధం లేకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

యూకే యంగ్‌ ప్రొఫెషన్‌ స్కీమ్‌ పేరుతో తెచ్చిన ఈ కొత్త పథకంలో 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్సు వారు రెండేళ్ల పాటు ఎలాంటి జాబ్స్‌, స్పాన్సర్స్‌ లేకపోయినా నివసించ వచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ట్వీట్‌లో పేర్కొంది.  

యూకే- ఇండియా యంగ్‌ ప్రొఫెషన్‌ స్కీంలో ప్రతి సంవత్సరం యూకేకి చెందిన 3వేల ప్రాంతాల్లో పైన పేర్కొన్న పరిమిత వయస్సు గల భారతీయులు ఉండేందుకు అర్హులు. యూకే ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా భారతీయులకు యూకేకు వెళ్లేందుకు అప్లికేషన్‌లను ఫిబ్రవరి 28 నుంచి మార్చి2 లోపు సబ్మిట్‌ చేయాలని భారత్‌లోని యూకే రాయిబారి కార్యాలయం ట్వీట్‌ చేసింది. 

మార్చి 2లోపు అభ్యర్ధులు సబ్మిట్‌ చేసిన అప్లికేషన్‌లలో నుంచి లక్కీ డ్రా రూపంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయనుంది. అక్కడ అర్హులైన అభ్యర్ధులు వీసాకు అప్లయి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 

అర్హతలు , దరఖాస్తు చేసే విధానం 

రాయబారి కార్యాలయం పేర్కొన్నట్లు ధరఖాస్తు చేయాలి

ఆ ధరఖాస్తును నిర్ణీత గడువులో సబ్మిట్‌ చేయాలి.  

దరఖాస్తు తేదీకి 6 నెలల కంటే ముందు జారీ చేయబడిన స్థానిక పోలీసు సర్టిఫికేట్ లేదా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను అందించాలి

 బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హతను కలిగి ఉండాలి. 

విద్యా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జతచేయాలి 

దరఖాస్తుదారు అవసరమైన అర్హత కలిగి ఉన్నారనేలా కాలేజీ నుంచి లేదా యూనివర్సిటీ నుండి వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు