కోడి పందాల రాయళ్ల అరెస్టు

15 Aug, 2023 02:06 IST|Sakshi

గంట్యాడ: మండలంలోని కొత్త వెలగాడ గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న కొంతమందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామంలో కోడి పందాలు ఆడుతున్నట్లు మహిళాపోలీస్‌ గంట్యాడ పోలీసులకు సమాచారమందించడంతో గ్రామంలో పోలీసులు మాటు వేసి కోడి పందాలు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12,470, మూడు కోండి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాట అడినట్లయితే చర్యలు తీసుకుంటామని ఎస్సై కిరణ్‌ కుమార్‌ నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఎరువుల షాపు సీజ్‌

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని మొయిద నారాయణపట్నంలో గల శ్రీ మణికంఠ రైతు డిపో ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎరువులు, పురుగు మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో రూ.4,20, 832 విలువ చేసే ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు కనిపించడంతో షాపును సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ బి.సింహాచలం, ఏఓ పూర్ణిమ, ఏఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పార్వతీపురం: సీతానగరం మండలం జోగింపేటకు చెందిన జాగాన పోలినాయుడు గుట్కాలు తినడం కారణంగా నోట్లో పుండ్లు ఏర్పాడ్డాయి. అలాగే ముఖం అందవికారంగా ఉందని భావించి మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం భార్య ఆదిలక్ష్మి గమనించి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి 108 వాహనం ద్వారా చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

బెదిరించేందుకు మహిళ..

పార్వతీపురం: కుటుంబసభ్యులను బెదిరించేందుకు సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన మండల అపర్ణ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆమెను చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు