36 స్థానాల్లో బీజేపీ, టీఎంసీ పార్టీల మధ్య ఆసక్తికరంగా మెజార్టీ...!

2 May, 2021 20:19 IST|Sakshi

కోల్‌కత్తా: బెంగాల్‌ దంగల్‌లో సీఎం మమతా బెనర్జీ మరోసారి తన సత్తా చాటింది. నందిగ్రామ్‌లో దీదీ సమీప బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై  1736 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటీకి దీదీ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 292 స్థానాలకుగాను అధికార టీఎంసీ 200కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ సుమారు 80 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాగా బెంగాల్‌ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.  కొన్ని నియోజక వర్గాల్లో బీజేపీ, టీఎంసీ పార్టీ అభ్యర్థుల మధ్య వెయ్యిలోపు మాత్రమే మెజార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

సుమారు 60 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య మెజార్టీ ఓట్ల తేడా 2000 లేదా అంతకన్నా తక్కువగా ఉంది. టీఎంసీ లీడ్‌లో ఉన్న36 స్థానాల్లో ఓట్ల తేడా వెయ్యి కంటే తక్కువగా ఉంది. టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య 11 స్థానాల్లో 500 కన్నా తక్కువగా, పది స్థానాల్లో వెయ్యి నుంచి 500 ఓట్ల మెజార్టీ తేడా ఉంది.

చదవండి: బెంగాల్‌లో ఓడింది.. మరి ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో?

మరిన్ని వార్తలు