మాజీ ఎంపీ బాసుదేవ్‌ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం

13 Nov, 2023 17:55 IST|Sakshi

Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్‌లోని  బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు.  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి ఎండీ సెలీమ్‌ నివాళులర్పించారు.   

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు.  1980 నుంచి 2014 వరకు  దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో  తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు.

1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్‌. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా,  తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు.  అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ,  ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు