హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అద్దంకి దయాకర్‌ రియాక్షన్‌ ఇదే..

10 Nov, 2023 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చింది.  మరోవైపు, తనకు సీటు ఇవ్వకపోవడంపై దయాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్బంగా అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్‌ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్‌​ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. 

ఇదిలా ఉండగా.. పటాన్‌చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు జరిగింది. దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. తన అనుచరుడు కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. దీంతో, రాజనర్సింహ శాంతించారు. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తుల అంశంలో కాంగ్రెస్‌-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్‌ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది. కాగా, సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు