నారా లోకేశ్‌ కోసం ఇద్దరు యాంకర్లు రెడీ అయ్యారు: అంబటి సెటైర్లు

19 Dec, 2023 18:07 IST|Sakshi

అమరావతి: లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరూ గుర్తించని యాత్ర అది అని ఎద్దేవా చేశారు. కనీసం లోకేష్ కైనా, పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా? అని ఎద్దేవా చేశారు. లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. లోకేష్‌ది అశుభయాత్ర అని అంటూ విమర్శించారు.

'ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగ మారదనే వేమన శతకంలాగ లోకేష్ యాత్ర కొనసాగింది. యాత్ర వలన ఒళ్లు తగ్గిందే తప్ప, మైండు మెచ్యూరిటీ లేదు. కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. అశుభయాత్ర చేశాడు లోకేష్. పాదం పెట్టగానే నందమూరి వంశస్తుడు చనిపోయాడు. జనంలేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎల్లోమీడియా నైతే విపరీతంగా జనం వచ్చారని చెప్పటానికి తెగ ప్రయత్నం చేసింది. చివరికి యాంకర్ ఉదయభానుని తెచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది' అని అంబటి అన్నారు.

'బీసీ, ఎస్సీ, ఎస్టీ చౌదర్లులారా.. అంటూ లోకేష్ మాట్లాడారు.  మూడు పదిహేను వేలు తొంభై వేలు అని చెప్పిన అజ్ఞాని లోకేష్. బాలకృష్ణ రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. ఇంకో యాంకర్ పవన్ కళ్యాణ్ కూడా రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. వృద్ధ తండ్రి తన అసమర్ధ కొడుకుని హైలెట్ చేయటానికి చేస్తున్న ప్రయత్నమే కనిపిస్తుంది. లోకేష్ యాత్ర అంత విజయవంతమైతే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ల యాంకరింగ్ ఎందుకు? సీట్లు, నోట్లు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్‌తో యాంకరింగ్‌కి ఒప్పించుకున్నారు. కిరాయి తీసుకుని పవన్ కళ్యాణ్ లోకేష్ సభకి యాంకరింగ్ చేస్తున్నారు. స్పెషల్ ఫైట్లు, స్పెషల్ రైళ్లలో రేపు జనాన్ని తరలిస్తున్నారు.' అని అంబటి చెప్పారు.

'స్కాంలో సంపాదించిన సొమ్ము రేపు ఖర్చు పెట్టబోతున్నారు. సోదరుడికి, చౌదరికి తేడా తెలీని వ్యక్తి లోకేష్. సూట్ కేసులు మోసేది నాదెండ్ల మనోహర్.  ప్రజల్లో గెలవకుండా మంత్రి ఐన వ్యక్తి లోకేష్. అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుసు? 175 సీట్లు గెలవటమే లక్ష్యంగా ఇన్ఛార్జుల ప్రకటన జరుగుతోంది. అంతర్గత బదిలీలు సహజంగా జరుగుతుంటాయి. చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకు బదిలీ అయ్యారు?' అని అంబటి మండిపడ్డారు. 

ఇదీ చదవండి: చంద్రబాబు ప్లాన్‌.. పవన్‌, నాగాబాబుకు కొత్త కష్టం!

>
మరిన్ని వార్తలు