జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్‌ షా

11 Dec, 2023 19:52 IST|Sakshi

ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రటించారు. అదే విధంగా జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు.

మరోవైపు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదికూడా చదవండి:  ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

>
మరిన్ని వార్తలు