AP Political Updates Feb 15th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

15 Feb, 2024 18:24 IST|Sakshi

AP Elections Political Latest Updates Telugu..

5:45 PM, Feb 15th, 2024
వెన్నుపోటు అనేది చంద్రబాబు బ్రాండ్‌ : గుడివాడ అమర్నాథ్‌

  • విశాఖలో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్
  • నాకు చంద్రబాబు లాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు
  • చంద్రబాబు ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కున్నారు.
  • సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్ లో కూర్చున్నాను.
  • సీఎం జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదు.
  • తెలివితక్కువ దద్దమ్ములు టిడీపి నేతలు.
  • అసెంబ్లీలో బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కుర్చున్నారు.
  • బాలకృష్ణను ధూళిపాలి నరేంద్ర   ప్రశ్నించాలి.
  • జగన్ మోహన్ రెడ్డి వద్ద మేము సైనికులం.
  • జగన్ అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారు

5:30 PM, Feb 15th, 2024
కరకట్టపై సైకిల్‌ కసరత్తులు

  • కరకట్ట ఇంట్లో పార్టీ నేతలతో చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు
  • ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం పాటు నోరు మెదపని బాబు
  • బీజేపీ పెట్టిన షరతులపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం
  • పార్టీ బలం చూపించేందుకు భారీగా కరకట్టకు రావాలని పార్టీ క్యాడర్‌కు సీనియర్ల పిలుపు
  • నరసారావుపేటలో అనిల్‌ సభ గ్రాండ్‌ సక్సెస్‌పై చర్చ
  • నరసరావుపేట నేత అట్లా చిన్న వెంకటరెడ్డితో మాట్లాడిన చంద్రబాబు
  • చంద్రబాబును కలిసిన సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్,
  • ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి , ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిల ప్రియ
  • నూజివీడు పార్టీ ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు తో చంద్రబాబు మంతనాలు
  • చింతలపూడి స్థానంపై పార్టీ నేతల్లో బేధాబిప్రాయాలు
  • ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నాయకులతో బాబు చర్చలు
  • నరసరావుపేట ఎంపి కృష్ణదేవరాయులతో భేటీ అయిన చంద్రబాబు

5:15 PM, Feb 15th, 2024
కిం కర్తవ్యం.?

  • పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ భేటీ
  • ఎన్నికల సభల నిర్వహణ పై చర్చ
  • ఇంతకీ మనమెక్కడ పోటీ చేస్తామని నేతల ప్రశ్నలు
  • ఆ ఒక్కటి తప్ప.. అన్నట్టుగా పవన్‌ కళ్యాణ్‌ వైఖరి

5:00 PM, Feb 15th, 2024
జగన్‌ అంటే అభివృద్ధి, సంక్షేమం

  • ఎన్టీఆర్ జిల్లా : రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం
  • పాల్గొన్న మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని, మైలవరం సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు
  • ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయానికి సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేటట్లు చేస్తున ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం : జోగి రమేష్‌
  • విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్య అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం
  • మీ దగ్గరకు తోడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త..! ఇద్దరు రెఢీగా ఉన్నారు, మూడో మొహం తయారవుతుంది
  • జగనన్న ద్వారానే పేదోడి ముఖంలో  ఆనందం చూడగలుగుతున్నాం
  • జగనన్న ఉంటేనే అన్ని సంక్షేమ ఫలాలు వస్తాయి
  • వాళ్ళు వస్తే అన్ని ఆపేస్తామని తోడు దొంగలు అంటున్నారు
  • పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయడం ఎంపీ కేశినేని నాని ప్రత్యేకత
  • మీ అందరికీ సేవచేసుకునేందుకు ఒక సామాన్య వ్యక్తిని గెలిపించాలని మైలవరంలో సర్నాల తిరుపతిరావు ను సీఎం జగన్ నియమించారు : ఎంపీ కేశినేని నాని
  •  మన దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్నారు
  • మన సీఎం జగన్ మోహన్ రెడ్డికి మనమందరం రుణపడి ఉండాలి
  • రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ ను  సీఎంగా చేసుకోవాలి
  • జగన్ అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది
  • టీడీపి ప్రభుత్వంలో మామకు వెన్నుపోటు పొడిసిన దొంగ చంద్రబాబు
  • విలేజ్ క్లినిక్ లు పెట్టి పేద ప్రజలకు అందుబాటులోకి వైద్యం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
  • సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు బాధ్యత అప్పగించిన  సీఎంకు  కృతజ్ఞతలు : మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు
  • పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
  • పార్టీ గెలుపుకు నియోజకవర్గంలో అక్కా చెల్లెమ్మల సహకారంతో మన అందరి ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేస్తాం

4:10 PM, Feb 15th, 2024
స్కిల్ స్కామ్ కేసు విచారణ మరోసారి వాయిదా

  • స్కిల్ స్కాంలో అప్రూవర్‌గా మారిన చంద్రకాంత్ షా పిటీషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ
  • మరోసారి వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాదులు
  • మార్చి 1కి కేసు విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

3:45 PM, Feb 15th, 2024

చంద్రబాబు నరరూప రాక్షసుడు: మంత్రి జోగి రమేష్‌

  • పెనమలూరులో వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్
  • ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం.
  • ఇంగ్లీష్ మీడియం వద్దని చంద్రబాబు కోర్టుకి వెళ్లాడు.
  • వెల్నెస్ కేంద్రాలలో 14 రకాల పరీక్షలు చేస్తున్నాం.
  • ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం.
  • కులాలకు,మతాలకు అతీతంగా పథకాలు అందించాం.
  • ఎలక్షన్ సీజన్లో చంద్రబాబు, పవన్ తోడు దొంగలలా వస్తున్నారు.
  • సీఎం జగన్ ఇప్పటివరకు 124 సార్లు బటన్ నొక్కారు.
  • మీరు రెండుసార్లు బటన్ నొక్కి గెలిపించండి.
  • 175 స్థానాల్లో గెలవటమే మా అజెండా

2:45 PM, Feb 15th, 2024
గోదావరి టూర్‌ క్యాన్సల్‌.. అసలు కారణమేంటంటే.?

  • పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన వాయిదా
  • మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోనే ఉన్న పవన్
  • పేరుకు హెలిప్యాడ్ అంటూ సాకులు
  • 3 గంటల ప్రయాణానికి కారులో ఎందుకు రావడం లేదంటున్న పార్టీ నేతలు
  • వారం రోజుల నుంచి తెలుగుదేశం క్యాంపు నుంచి అందని సంకేతాలు
  • ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు అయోమయం
  • పవన్‌కు ఏ సీట్లు దక్కుతాయో అన్నదానిపై సందేహాలు
  • భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి నేతలను మంగళగిరికి రమ్మన్న పవన్ కళ్యాణ్
  • వివిధ జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు
  • మూడు రోజుల పాటు సమావేశాల అనంతరం పవన్ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిద్దామంటున్న నేతలు
  • అభ్యర్థుల ఎంపికపై పార్టీలో గందరగోళ పరిస్థితులు
  • ఎన్ని టికెట్లు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో ఎవరికి హామీ ఇస్తామంటోన్న పార్టీ పెద్దలు

2:22 PM, Feb 15th, 2024
పొత్తు ఇంకా పొడవకముందే.. అరకులో గడబిడ

  • టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలు
  • అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత నకిలీ గిరిజనురాలు
  • ఒకే కుటుంబంలో తమ్ముడు ఎస్సీ అయితే, అక్క ఎస్టీ ఎలా అవుతారు ?
  • బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇస్తే గిరిజనులంతా ఏకమై ఉద్యమం చేస్తాం : టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి

2:11 PM, Feb 15th, 2024
బాబు.. మీకో దండం.!

  • టీడీపీ కి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీఏలో కలిసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాజీనామా
  • విభజన హామీలను నెరవేర్చని NDA లో చేరాలనుకోవడం సహించరాని విషయం
  • అధికారం కోసం నా ఆత్మను అమ్ముకోలేనని చంద్ర బాబుకు ఘాటు లేఖ

2:05 PM, Feb 15th, 2024
ఆక్‌పాక్‌ కరివేపాక్‌.. అదిరిందయ్య చంద్రం.!

  • తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో గుంభనంగా టిడిపి, జనసేన
  • టిడిపి క్యాండిడేట్లు వీరేనంటూ ఎల్లో మీడియాలో ఓ జాబితా
  • 10 సీట్లకు టిడిపి, 3 సీట్లలో జనసేన అంటోన్న ఎల్లో మీడియా
  • మొత్తం 19 సీట్లకు గాను 13 పేర్లు చెబుతోన్న ఎల్లో మీడియా
  • ఈ లెక్కన పవన్‌ కళ్యాణ్‌ను కరివేపాక్‌ చేశారంటోన్న జనసేన నాయకులు
  • జనసేనకు అంతో ఇంతో బలమున్న ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న సీట్లు 34
  • జనసేనను 7 లేదా 8 సీట్లకు పరిమితం చేయాలన్న యోచనలో బాబు
  • జనసేనకు ఇచ్చే 25 సీట్లలోనూ మెలిక పెడతారని ప్రచారం
  • 10 చోట్ల టీడీపీ నేతలను ముందే జనసేనలోకి పంపి.. గ్లాసు గుర్తుపై పోటీ చేయించడం
  • నా మాట వినడం లేదని చెప్పి ఒక 5 నుండి 6 చోట్ల టిడిపి రెబల్స్‌ను పోటీకి దింపడం
  • ఏతావాతా సెప్పొచ్చేదేటంటే... పవన్ వలన కాపు ఓట్లు టీడీపీకి పడి లబ్దిపోందాలి.. కానీ జనసేన బలపడకూడదు

1:53 PM, Feb 15th, 2024
కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి: ఎమ్మెల్సీ భరత్‌

  • కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్‌ కీలక వ్యాఖ్యలు
  • కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మైనారిటీల అధ్యక్షుల ఏకగ్రీవంగా ఎన్నిక
  • పార్టీ బలోపేతం కోసమే నూతన నియామకంగా పేర్కొన్న ఎమ్మెల్సీ భరత్‌
  • మైనారిటీలకు ఆపద వస్తె ముందు ఉంటా
  • మైనారిటీలతో పాటు అన్ని వర్గాలను ఆదుకుంటోంది వైఎస్సార్‌సీపీనేనని వ్యాఖ్య
  • కుప్పం నియోజకవర్గానికి సంబంధించి, 17 కోట్లు నీటి బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేసిన  భరత్‌
  • కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలన్న భరత్‌
  • జరగబోయే యుద్ధంలో మనం గెలువబోతున్నామంటూ వ్యాఖ్య

1:40 PM, Feb 15th, 2024
జగనన్న పాలనకు ప్రజా పట్టం.. పచ్చ మందకు సహించడం లేదు

  • ఓడిపోతామని భయం కలిగినప్పుడు ఇష్టమొచ్చిన హామీలు ఇస్తారు
  • అధికారంలోకి వచ్చాకా సాకులు చెపుతారు
  • కానీ వైఎస్ జగన్ మాత్రం అలా కాదు
  • అధికారంలోకి వచ్చిన నాటి నుంచే.. ఇచ్చిన హామీల్ని అమలు చేశారు
  • వైఎస్సార్‌ కృషి వల్ల నేడు కరువు ప్రాంతాల్లోను పంటలు సాగవ్వుతున్నాయి
  • వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రయాణం సాగుతోంది
  • ఫలితంగానే.. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ,  21 ఎంపీ స్దానాల్లోపార్టీ గెలుపు
  • కరోనా లాంటి విపత్తులు ఎదురైనా.. సంక్షేమం ఆగలేదు
  • పథకాల్ని ఇంటి వద్దకే సచివాలయ వ్యవస్ద ద్వారా ప్రజలకు అందిస్తొంది జగనన్న ప్రభుత్వం 
  • ప్రజలకు చేస్తున్న మేలును.. పచ్చ మీడియా రాసే పరిస్దితి లేదు
  • ఇతర రాష్టాలు అదర్శంగా తీసుకునే పరిస్దితి ఉన్నా.. మంచిని మంచిగా రాయడం లేదు
  • బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి
  • మూడు పర్యాయాలు పాలించిన చంద్రబాబు.. ఏమి చేశారో చెప్పుకొలేని పరిస్దితి
  • టిడిపి, జనసేన, పచ్చ మీడియా రాతలు నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు 
  • ఓ వైపు సంక్షేమం, అభివృద్ది.. మరో వైపు రాష్ట్ర అదాయం పెరుగుతోంది
  • రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఎంతో పటిష్టంగా ఉంది
  • అనంతపురం రాప్తాడులో సిద్దం సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు 
  • ప్రభుత్వం చేస్తున్న మంచి, ప్రతిపక్షాలు చల్లుతున్న బురదను అయన వివరించనున్నారు
  • పార్టీ కేడర్‌ అంతా తరలివచ్చి విజయవంతం చేయాలి

కర్నూలులో మాజీ మంత్రి.. కర్నూలు, నంధ్యాల జిల్లాల రీజనల్ కో అర్డినేటర్ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలు

1:16 PM, Feb 15th, 2024
పవన్‌కు హరి రామజోగయ్య మరో లేఖ 

  • కాపు, ఇతర సామాజిక వర్గాలున్న స్థానాల్ని వదులుకోవద్దొంటూ జనసేనానికి మాజీ ఎంపీ హరి రామజోగయ్య లేఖ
  • పవన్‌ను నర్సాపురం, భీమవరం నుంచి పోటీ చేయాలని సూచించిన జోగయ్య
  • 6 ఎంపీ, 40కిపైగా అసెంబ్లీ స్థానాలు వదులుకోవొద్దని లేఖలో పేర్కొన్న జోగయ్య
  • పొత్తులో భాగంగా రాజీ పడొద్దంటూ మొదటి నుంచి సూచిస్తున్న కాపు సంక్షేమ అధ్యక్షుడు
  • అయినా ఫలితం లేకుండా పోతోందని గత లేఖల్లో ఆవేదన

లేఖలో జోగయ్య సూచించిన స్థానాలు ఏవంటే.. 

12:21 PM, Feb 15th, 2024
తోడేళ్లు రాష్ట్రాన్ని ముంచేయాలనుకుంటున్నాయ్‌: వెలంపల్లి

  • డ్రైనేజీల కాల్వ గట్లు కోసం 450 కోట్లు మంజూరు చేస్తే బోండా ఉమా అవినీతికి పాల్పడ్డాడు
  • కమిషన్స్ దందాకు కేరాఫ్ అడ్రస్ బోండా ఉమా
  • ఆలీబాబా అరడజను దొంగల్లో టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు
  • బోండా ఉమ కమిషన్ కు కక్కుర్తి పడి విజయవాడ నగర అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేశారు
  • చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు
  • అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల నెరవేరుస్తాం
  • చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే విద్యార్థిని విద్యార్థులకు అమ్మబడి తీసేస్తాడు
  • వలంటరీ వ్యవస్థను తీసేస్తాడు
  • ఇన్ని పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు.. అమ్మకు వందనం ద్వారా ఇంట్లో ఇద్దరికి ఇస్తానని ఎలా చెప్పాడు
  • రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి మహిళా లోకాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారు
  • వీరి ముగ్గురు వివిధ రూపాల్లో రాష్ట్రాన్ని ముంచేయటానికి వచ్చిన తోడేళ్లు 
  • చంద్రబాబు వదిన కూడా రాష్ట్రానికి పట్టిన పీడ

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

11:42 AM, Feb 15th, 2024
టీడీపీ కుట్ర బట్టబయలు 

  • షర్మిలపై టీడీపీ మద్దతుదారుడు ఉదయ్‌ అసభ్య పోస్టింగ్‌లు 
  • వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్‌ అకౌంట్‌ సృష్టి
  • వర్రా రవీంద్రారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు
  • చేసిందంతా చేసి వైఎస్సార్‌సీపీపై విషం జిమ్మిన టీడీపీ

11:30 AM, Feb 15th, 2024
అసెంబ్లీ స్పీకర్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేల లేఖలు

  • వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు
  • తన కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో స్పీకర్‌ ప్రస్తావన
  • హాజరుకు గడువు కోరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలపై అభ్యంతరాలు
  • ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ ప్రకారం చెల్లదంటూ ముగ్గురి అభ్యంతరం
  • స్పీకర్‌కు సమర్పించిన వీడియోలు ఒరిజినల్‌ కావో తేల్చాల్సిన అవసరం ఉందంటూ లేఖలో ప్రస్తావన
  • సర్టిఫైడ్‌ కాపీలు కావాలంటూ కొత్త మెలిక

10:46 AM, Feb 15th, 2024
సీఎం జగన్‌ మొదటి నుంచి మాకు అండగా ఉన్నారు

  • మేధావులు ముసుగులో సీఎం జగన్ పై ఈనాడులో తప్పుడు కథనం
  • ఈనాడు కథనాన్ని ఖండించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు.
  • స్టీల్ ప్లాంట్ తో చంద్రబాబు పవన్ రాజకీయం చేశారు
  • జీవీఎంసీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన డ్రామాలు అడాయి
  • ఎన్నికలు తరువాత స్టీల్ ప్లాంట్ విషయం మర్చిపోయాయి
  • మొదటినుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అండగా సీఎం జగన్ ఉన్నారు
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోదీకి  రెండుసార్లు లేఖ రాశారు.
  • ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు
  • స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు పాదయాత్ర చేశారు
  • పార్లమెంట్ లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిరసన చేపట్టారు.
  • కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది.
  • జీవీఎంసీ, జడ్పీ సమావేశం, వైఎస్సార్సీపీ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసింది
  • ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహాయ సహకారాలపై ఉద్యోగుల ధన్యవాదాలు

10:37 AM, Feb 15th, 2024
సుప్రీంలో నేడు స్కిల్‌ కేసు విచారణ

  • సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసు విచారణ
  • గతంలో ఇచ్చిన తీర్పులో  కొన్ని కరెక్షన్స్ చేయనున్న ధర్మాసనం
  • మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ
  • విచారణ చేపట్టన్ను జస్టిస్ అనిరుద్ బోస్,  జస్టిస్ బేల త్రివేది బెంచ్‌

10:19 AM, Feb 15th, 2024
నేడు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల విచారణ

  • టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం
  • నేడు విచారణకు హాజరు కావాలని టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు
  • మధ్యాహ్నం సమయంలో వంశీ మోహన్‌, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌, మద్ధాలి గిరిల విచారణ
  • పిటిషనర్‌ టీడీఎల్పీ విప్‌ స్వామికి సైతం పిలుపు

9:55 AM, Feb 15th, 2024

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం!

  • రాజ్యసభ బరి నుంచి తప్పుకున్న టీడీపీ
  • ఏకగ్రీవం కానున్న ఏపీ రాజ్యసభ ఎన్నికలు
  • మూడు సీట్లకు ఇప్పటికే నామినేషన్లు వేసిన గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు
  • రెండు సెట్ల నామినేషన్లు సమర్పించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
  • తగినంత బలం లేకపోవడంతో అభ్యర్థిని నిలపొద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం
  • ఇదే అంశాన్ని కీలక నేతల వద్ద ప్రస్తావించిన చంద్రబాబు
  • ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల బలం 18
  • రాజ్యసభ సీటు కోసం 44 అవసరం!
  • ఇంకో పాతిక మందిని జమ చేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు
  • వైఎస్సార్‌సీపీలో టికెట్‌ దక్కని వాళ్లకు గాలం వేసే యత్నం
  • తన మార్క్‌ రాజకీయం పండకపోవడంతో.. తోక ముడిచిన చంద్రబాబు
  • ఫలితంగా.. నలభై ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ ప్రాతినిధ్యం లేకుండా పోతున్న వైనం 
     

8:37 AM, Feb 15th, 2024
లోకేష్‌ స్థాయి ఏపాటిదంటే.. 

  • నారా లోకేష్ చేసింది శంఖారావం కాదు శునకారావం
  • జనం తన సభకు రాలేదని కోపంతో లోకేష్ నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు
  • స్కిల్‌ స్కామ్‌ కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. సభలు పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
  • లోకేష్  మంత్రి గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏమీ అభివృద్ధి చేశారో నిరూపించాలి
  • స్థానిక టీడీపీ నాయకుల కోసం పార్వతీపురం ప్రజలు ఏమీ అనుకుంటున్నారో లోకేష్ ముందు తెలుసుకోవాలి
  • టీడీపీ ఇన్‌ఛార్జి పై ఒక ఎన్జీవో సంస్థ వారు అవినీతి చేసినట్లు తెలిపిన విషయాన్ని తెలుసుకోవాలి
  • గతంలో టీడీపీ అధికారంలో ఎంత అవినీతి చేశారో ప్రజలకు అడిగి లోకేష్ తెలుసుకోవాలి
  • ప్రజల్లో తన స్థాయి ఏంటో లోకేష్‌  ఇప్పటికైనా గుర్తించాలి
  • గతంలో పార్వతీపురం నియోజకవర్గంలో ఎవరికి అయినా కనీస స్థాయిలో సాయం చేశారా.?
  • సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ విషప్రచారానికి దిగుతోంది టీడీపీ
  • సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో క్లారిటీ లేదు
  • చంద్రబాబు మాలోకం అయిన లోకేష్ కు గ్యారెంటీ తప్ప ప్రజలకు కాదు
  • లోకేష్ మంగళగిరి, చంద్రబాబు కుప్పం లో గెలిచిన పరిస్థితి ప్రస్తుతం ఉందా?
  • గత టీడీపీ హయాంలో మంచినీటి సమస్యను పార్వతీపురంలో ఎందుకు పరిష్కరించ లేదు
  • రాజకీయ పరిజ్ఞానం లేకుండా చంద్రబాబు పేరు చెప్పుకొని లోకేష్ బయట తిరుగుతున్నారు.
  • ఎర్ర బుక్ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
  • చంద్రబాబును జైల్లో పడితే లోకేష్ భయపడి పారిపోయాడు
  • నాపై  కబ్జా ఆరోపణలు చేసిన లోకేష్..  వాటిని రుజువు చేయాలి.
  • మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన వెంటనే లోకేష్ ను ఎర్ర బుక్ మడత పెట్టడం ఖాయం.

నారా లోకేష్‌కు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కౌంటర్‌

8:03 AM, Feb 15th, 2024
స్కిల్‌ కేసు.. ఏసీబీ కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

  • స్కిల్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన ఎసిఐ ఎండీ చంద్రకాంత్ షా పిటీషన్ పై విచారించనున్న కోర్టు
  • చంద్రకాంత్ షా పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు న్యాయవాదులు
  • కౌంటర్ దాఖలుకి సమయం కావాలంటూ పలుమార్లు వాయిదాలు కోరిన‌ చంద్రబాబు న్యాయవాదులు
  • నేడు వాంగ్మూలం ఇచ్చేందుకు  ఎసిబి కోర్టుకి హాజరుకానున్న చంద్రకాంత్ షా
  • ఏసీబీ కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
  • స్కిల్ కేసులో అప్రూవర్ గా మారుతున్నట్లు ఇప్పటికే ఎసిబి కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్
  • బోగస్ ఇన్వాయిస్ ల తో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా పిటీషన్ లో పేర్కొన్న చంద్రకాంత్ షా
  • స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా
  • స్కిల్ కేసులో ఎ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా
  • డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్ లని ఇవ్వాలని వారు కోరినట్లు వాంగ్మూలమిచ్చిన చంద్రకాంత్ షా
  • ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్ లు, డిజైన్ టెక్ కి రెండు బోగస్ ఇన్వాయిస్ లు ఇవ్చానన్న చంద్రకాంత్ షా
  • బోగస్ ఇన్వాయిస్ లు ఇచ్చినందుకు 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం
  • అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్
  • రూ. 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు
  • అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలంపై చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరం
  • నేడు ఏసీబీ కోర్డులో కొనసాగనున్న విచారణ

7:28 AM, Feb 15th, 2024
మూడు ముక్కలాటగా మారిన కళ్యాణదుర్గం రాజకీయం

  • కళ్యాణదుర్గం టీడీపీ వర్గపోరు లో కొత్త ట్విస్ట్
  • టిక్కెట్ తనకే ఖరారు చేశారని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు ప్రచారం
  • కళ్యాణదుర్గం లో కార్యాలయం కోసం అమిలినేని సురేంద్ర బాబు ఏర్పాట్లు
  • కళ్యాణదుర్గం టిక్కెట్ కోసం ఇప్పటికే పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు
  • కళ్యాణ్ టీడీపీలో తెరపైకి వచ్చిన మూడో వర్గం
  • టిక్కెట్ ఖరారైందని అమిలినేని సురేంద్ర బాబు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి వర్గీయులు
  • కళ్యాణదుర్గం టీడీపీ లో మూడు ముక్కలాట పై సర్వత్రా చర్చ

7:00 AM, Feb 15th, 2024
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • పొత్తు పార్టీతో సీట్ల పంపకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  • ఉండవల్లిలోని నివాసంలో బుధవారం పలువురు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ 
  • పొత్తులు, చేరికల వల్ల పార్టీలో నేతలకు నష్టం జరగకూడదని వ్యాఖ్య
  • పొత్తులు ఉన్నా.. పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తానని హామీ
  • ఇప్పటికే సీట్ల పంపకంపై ఎటూ తేల్చుకోని చంద్రబాబు, పవన్‌
  • ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ అధినేత
  • బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్‌
  • ఢిల్లీ పరిణామాల తర్వాత ఇద్దరూ గప్‌చుప్‌
  • రాష్ట్ర పర్యటనను సైతం రద్దు చేసుకుని మంగళగిరి కార్యాలయంలోనే మీటింగ్‌లకు సిద్ధమైన పవన్‌
  • చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో.. కూటమి సీట్ల పంపకంపై నీలి నీడలు!

6:43 AM, Feb 15th, 2024
సొంతిళ్లు లేదుగానీ రాజకీయాలు కావాలట!

  • ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు
  • రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడో చెప్పాం
  • చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి
  • ఈ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌కు సొంత ఇల్లు లేదు కానీ వీళ్ళకి ఇక్కడ రాజకీయాలు కావాలి
  • వాళ్ల చౌకబారు వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరమూ లేదు

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

6:38 AM, Feb 15th, 2024
ప్చ్‌.. టీడీపీ 

  • రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్న టీడీపీ
  • సంఖ్యాబలం లేక చతికిలబడ్డ టీడీపీ
  • పార్టీ స్థాపన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఉనికి కోల్పోనున్న టీడీపీ
  • బలం లేకపోయినా ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు యత్నం
  • ఫలించని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు
  • సొంతపార్టీ ఎమ్మెల్యేల ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు
  • ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని భయపడ్డ చంద్రబాబు

6:30 AM, Feb 15th, 2024
సమాధానం చెప్పు లోకేశా?

  • లోకేష్ కళ్లుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం 
  • సీఎం జగన్ చేసిన అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్న
  • ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది సీఎం కాదా అని ప్రశ్నలు
  • మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు కనిపించడం లేదా?
  • ఇన్ఫోసిస్, యకోహమా పరిశ్రమలు విశాఖకు రావడం వాస్తవం కాదా?
  • విశాఖను పరిపాలనా రాజధానిగా అడ్డుకున్నది మీరు కాదా?
  • హుద్ హుద్ సమయంలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేసింది టీడీపీ నేతలే
  • వీటన్నింటికీ లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్

whatsapp channel

మరిన్ని వార్తలు