సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ సినిమా

15 Feb, 2024 07:19 IST|Sakshi

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్‌కు పోటీగా డిసెంబర్‌ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్‌,జవాన్‌ చిత్రాలతో షారుక్‌ ఖాన్‌ రెండు బ్లాక్‌ బస్టర్‌లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్‌లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్‌ వద్ద డంకీ ఆగిపోయింది.

తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్‌ డంకీ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో టాలీవుడ్‌ సినిమాలు అయిన సలార్‌,యానిమల్‌,గుంటూరు కారం, హాయ్‌నాన్న వంటి చిత్రాలు టాప్‌ టెన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్‌లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

A post shared by Netflix India (@netflix_in)

whatsapp channel

మరిన్ని వార్తలు