AP Assembly Elections 2024: కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

24 Jan, 2024 12:07 IST|Sakshi

ఎన్టీఆర్‌, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం ఉదయం ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు అందించారు.  

మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్తకు అప్లికేషన్‌ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. 

‘‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది.  
అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. మాజీలంతా నిజమైన కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పోటీ చేసే స్ధానంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అని అన్నారాయన. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega