AP Political News Feb 4th: పొలిటికల్ అప్‌డేట్స్ | Andhra Pradesh Elections 2024 | Andhra Pradesh Political 4th February Latest Updates And News - Sakshi
Sakshi News home page

AP Political News Feb 4th: పొలిటికల్ అప్‌డేట్స్

Published Sun, Feb 4 2024 7:02 AM

AP Political Updates Feb 4th - Sakshi

AP Elections Political Latest Updates Telugu

6.30 PM, Feb 4, 2024
పవన్ కల్యాణ్‌ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే: మంత్రి అంబటి రాంబాబు

  • చంద్రబాబు అద్దె ఇంట్లో భేటీ అయిన పవన్ కల్యాణ్- చంద్రబాబు
  • పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు
  • చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారో మరోచోట నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి
  • ఇప్పటికే మేము సిద్ధం, యుద్ధం కూడా అయిపోతుంది
  • వైఎస్సార్‌సీపీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పటిదాకా వీరు సీట్లు తేల్చుకోలేరు
  • సీట్లు కన్నా ముందు నోట్లు తేల్చుకోవాలి
  • నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదు
  • పవన్ కల్యాణ్‌ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే 
  • పవన్ కల్యాణకు ఇచ్చేది ముష్టి సీట్లు మూడో, ముప్పైయో, ఇరవైఐదో  
  • సీట్లు ఏమో ముష్టిస్తారు.. క్యాష్ ఏమో బలంగా ఇస్తారు

6.00 PM, Feb 4, 2024
ప్రకాశం  పొన్నలూరులో టీడీపీకి షాక్ 
మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో పది కుటుంబాలు టీడీపీ నుంచి అధికార వైఎస్సార్‌సీపీలో చేరిక

5:15 PM, Feb 4, 2024

ఎల్లో మీడియాపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌

  • సీఎం జగన్‌ వాస్తవాల ప్రసంగంపై ఎల్లో మీడియా రోత రాతలు రాసింది
  • చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే, సీఎం జగన్‌ చెప్పేవన్నీ వాస్తవాలు
  • చంద్రబాబు చెప్పే అబద్ధాలకు రామోజీరావు వత్తాసు పలుకుతున్నారు
  • సీఎం జగన్‌ పిలుపుతో సిద్ధం సభకు లక్షలాది మంది తరలివచ్చారు

4:40 PM, Feb 4, 2024
 సత్యసాయి జిల్లా ధర్మవరం 30, 33, 34, 35, 40 వార్డుల్లో టీడీపీకి చెందిన 175 కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక

4:15 PM, Feb 4, 2024
మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ​కామెంట్స్‌..

  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో​ అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి
  • ప్రజలకు సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలి
  • వైఎస్సార్‌సీపీకి వస్తున్న స్పందన చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది
  • విశాఖపై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది

 4:00 PM, Feb 4, 2024
దెందులూరు ఎమ్మెల్యే  అబ్బయ్య  చౌదరి కామెంట్స్

  • నిన్న జరిగిన సిద్ధం సభకు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా జనం వచ్చారు
  • మేమంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
  • పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నాము
  • దెందులూరులో జరిగిన సభ రాష్ట్రవ్యాప్తంగా చర్చినియాంశంగా మారింది
  • భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయి
  • జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే మా.. స్టార్  క్యాంపెనర్లలని సీఎం సూచించారు
  • వై నాట్ 175 అనేది నిన్న సభతో ప్రతిపక్షాలకు అర్థమైంది
  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనే నినాదం వినబడింది
  • ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదాము జగనన్న కోసం అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి
  • ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతారు
  • పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారు
  • కుప్పం టూ ఇచ్చాపురం అభ్యర్థులు ఎవరో చెప్పాము మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టంగా చెప్పాము
  • అభ్యర్థులు కరువై.. పొత్తులకు వెళుతున్నారు ప్రతిపక్షాలు

3:30 PM, Feb 4, 2024
మైలవరం టీడీపీలో ముసలం 

  • టీడీపీ నేత దేవినేని ఉమాకు టిక్కెట్ టెన్షన్  
  • ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన దేవినేని ఉమా
  • టీడీపీలోకి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా
  • నేను మా వదినను చంపానని నాపై వసంత కృష్ణ ప్రసాద్ అపవాదు వేశారు
  • 1999 ఎన్నికల్లో గెలుపు కోసం తండ్రీకొడుకులు ఇద్దరూ నాపై  దుష్ప్రచారం చేశారు
  • నా కుటుంబ సభ్యులను చంపానని ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు
  • వసంత కృష్ణ ప్రసాద్.. సుజనా చౌదరితో కలిసి సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయి
  • నాలుగున్నరేళ్లు ఇసుక వ్యాపారం చేసుకున్నాడు
  • 30 ఏళ్లు కాకుల్లా పొడిచినా నేను నోరెత్తలేదు
  • 30 ఏళ్ళు మానసికంగా చంపాలని, చంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు
  • మైలవరం నియోజకవర్గంలో సహజసంపద దోపిడీ చేశాడు
  • కేశినేని నాని మా కార్యకర్తలు, నాయకుల గుండెలపై తన్నాడు
  • కృష్ణ ప్రసాద్  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గుండెల మీద తన్ని హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి వైఎస్సార్‌సీపీ గోడ దూకి వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు
  • చంద్రబాబు మాట సుప్రీం.. ఈ నెల రెండో వారం నుంచి జనంలోకి వెళ్తాను
  • కృష్ణ ప్రసాద్, లగడపాటి రాజగోపాల్ లాంటి నాయకులు దోచుకున్న డబ్బును వెదజల్లేందుకు వస్తున్నారు
  • మైలవరం నియోజకవర్గంలో 100 కోట్లు వెదజల్లేందుకు వస్తున్నారు

02:01 PM, Feb 4, 2024
టీడీపీకి ఇవే లాస్ట్ ఎన్నికలు: ఎంపీ కేశినేని నాని

  • చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు 
  • చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారు
  • టీడీపీ పార్టీ పని అయిపోయింది
  • అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదు
  • ఇక్కడ సీట్లను అమ్ముకుని వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారు 
  • 2024 ఎన్నికలవ్వగానే మేలో ఫలితాలొస్తాయి 
  • రిజల్స్ట్ రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ల సొంత రాష్ట్రం తెలంగాణ పోవడం ఖాయం 
  • టీడీపీ పార్టీ ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి5, సోషల్ మీడియా మీదే ఆధారపడింది 
  • టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే వారియర్స్ ఎవరూ లేరు
  • నా చిన్నప్పుడు ఎన్టీఆర్ సభల్లో చూసినంత జనం సిద్ధం సభలో చూశా
  • గుడివాడలో చంద్రబాబు సభ పెడితే 3 వేల మంది కూడా రాలేదు 
  • చంద్రబాబు మాట్లాడేసరికి ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయారు 
  • చంద్రబాబు మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు
  • సీఎం జగన్‌ పేదల కోసం పనిచేసే వ్యక్తి 
  • ధనికుల కోసం.. పనికిమాలిన కొడుకు కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు
  • రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలి 
  • కేసీఆర్ కేసుపెడతాడని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడు
  • ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవడం ఖాయం

01:53 PM, Feb 4, 2024
ఈనాడు పిచ్చి రాతలు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

  • చంద్రబాబు చెప్పే అబద్దాలకు వత్తాసు పలికేందుకు రామోజీ రావుకు సిగ్గుండాలి
  • కనకదుర్గమ్మ ఆలయంలో సిఫార్సుతో సంబంధం లేకుండా అంతరాలయ దర్శనానికి టిక్కెట్ పెట్టడం జరిగింది
  • దీని వల్ల భక్తులకు మేలు కలుగుతుంది
  • అవాస్తవాలు ఎల్లో మీడియా రాస్తోంది
  • దేవాలయాల్లో అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం
  • దేవాలయాలు కూలగొట్టిన చంద్రబాబుకి ఏం తెలుసు దేవాలయాల గురించి
  • ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఈనాడు ఉద్దేశపూర్వకంగా విషపు రాతలు 
  •  దేవుడు ఆస్తులను కాపాడడానికి దేవాదాయ శాఖలో ప్రత్యేకంగా చట్టం చేశాం
  • ఏనాడైనా దాని గురించి ఈనాడు పత్రిక, ఎల్లో మీడియా ప్రచురించారా?
  • చంద్రబాబు ఏనాడైనా అర్చక స్వాములకు ఒక్క రూపాయి పెంచిన దాఖలాలు ఉన్నాయా?
  • 5 వేల నుంచి 10వేలకు, 10 వేలు తీసుకునే అర్చకులకు 15 వేలు పెంచడం జరిగింది
  • రాష్ట్రంలో వేల సంఖ్యలో ఆలయాలకు నిత్య పూజలు జరగాలని ధూప దీప నైవేద్యం అందచేస్తున్నాం.
  • దుర్గమ్మ గుడి ఆలయ అభివృద్ధి దూర దృష్టితో మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది
  • సింహచలంలో రూ.215 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
  • ప్రజల్ని కేవలం ఓట్లు వేసే యంత్రాలాగా చూసే వ్యక్తి చంద్రబాబు
  • 8 ఆగమాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో హోమం చేయడం జరిగింది.
  • దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయాల్లో ధర్మ ప్రచారం జరుగుతోంది

01:44 PM, Feb 4, 2024
సిద్దం సభలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు: మంత్రి వేణు

  • నిజమే పేదవాడికి రక్షణ.. నిజాన్ని గెలిపిస్తే పేదలకు మేలు జరుగుతుందని జగన్ భావించారు
  • సిద్దం సభలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుడుతుంది
  • చిరంజీవి పార్టీ పెట్టారు.. మొదటి సారి ఓటమి చెందారు
  • రెండో సారి పోటీ చేసి గెలవాలనుకోలేదు
  • మా వల్ల కాదని పార్టీ మూసేశారు
  • అన్నయ్య పార్టీ మూసేస్తే తమ్ముడు పార్టీ పెట్టారు
  • ఎదుట వాడికి జెండా మోయడమే ఆయన ఎజెండా
  • పేదలకు మంచి చేసి..వారి జీవితాల్లో వెలుగులు నింపాలకుంటున్న జగన్‌ను  ఓడించాలకుంటున్నారు పవన్
  • పవన్ ఒకసారి తనకు తాను ప్రశ్నించుకోవాలి

01:09 PM, Feb 4, 2024
కుప్పం కూడా గెలవబోతున్నాం: మాజీ మంత్రి వెల్లంపల్లి

  • సిద్ధం సభ ద్వారా సీఎం జగన్‌ మమ్మల్ని ఎన్నికలకు సంసిద్ధం చేశారు 
  • లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధం సభకు తరలివచ్చారు
  • చంద్రబాబు.. పవన్ కలిసి పెట్టినా ఇలాంటి సభ నిర్వహించలేరు 
  • మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్న దమ్మున్న నాయకుడు జగనన్న 
  • చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • కుప్పం కూడా గెలవబోతున్నాం.. నిన్న సభే అందుకు ఉదాహరణ
  • రాజకీయాల్లో సీఎం జగన్‌ పెద్ద స్టార్
  • సీఎంజగన్‌ను చూసేందుకు యువత భారీగా తరలివచ్చారు 
  • గత ఐదేళ్లలో అభివృద్ధిని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించాడు
  • సీఎం జగన్‌ నిజమైన అభివృద్ధిని చూపించారు
  • గత ఎన్నికల్లో 151 వచ్చాయి.. ఈ సారి 175 పక్కాగా సాధిస్తాం

12:45 PM, Feb 4, 2024
దెందులూరు సిద్ధం సభ సూపర్ సక్సెస్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • సీఎం జగన్‌ ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు నెరవేర్చారు
  • రెండున్నర లక్షల కోట్లతో ప్రజలందరికీ మేలు చేశారు
  • ఏపీలో ఏ రాజకీయ పార్టీ ఇంతటి పెద్ద సభను నిర్వహించలేదు
  • చంద్రబాబు, పవన్ తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు
  • వాళ్ల మధ్య సీట్ల పంపకమే ఓ కొలిక్కి రాలేదు 
  • 175కి 175 ఎమ్మెల్యేలు.. 25కి 25 ఎంపీలు గెలవడమే మా లక్ష్యం
  • వచ్చే రెండు...మూడు నెలలు  నిత్యం జనాల్లో ఉండేలా మా నాయకుడు దిశానిర్ధేశం చేశారు
  • సీఎం జగన్‌ ఇచ్చిన స్తూర్తితో ప్రజల్లోకి వెళ్తాం.. లక్ష్యం చేరుకుంటాం
  • ఇల్లు లేని పేదలు ఉండకూడదనేది సీఎం జగన్ ఆలోచన
  • త్వరలో సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటిస్తారు
     

12:24 PM, Feb 4, 2024
ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యం: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

  • చంద్రబాబు కొత్త బిచ్చగాడు కాదు
  • పదవీ కాంక్ష, పదవీ వ్యామోహం తప్ప.. పేదలకు చేసింది ఏమీ లేదు
  • కులం,మతం పేరుతో రెచ్చగొట్టేందుకు 6న జీడీ నెల్లూరులో సభ పెట్టేందుకు వస్తున్నాడు
  • ఇంగ్లీష్ మీడియం పెడితే పేదల జీవితాలు మారతాయని నమ్మిన వ్యక్తి సీఎం జగన్‌
  • చంద్రబాబు.. షర్మిలను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చుతున్నాడు
  • పేదలు గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి సీఎం జగన్‌
  • ప్రజలు అందరూ ఆయనకు అండగా ఉన్నారు
  • జీడీ నెల్లూరు సీటు కేటాయించినందుకు సీఎం జగన్‌కు  రుణపడి ఉంటా
  • నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పాదాభి వందనం చేస్తున్నా

11:55 AM, Feb 4, 2024
చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్‌

  • కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో తనకు క్లీన్‌చిట్‌ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందన
  • నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరా
  • చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా?
  • చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా?
  • బాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలి
  • చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు
  • నాపై ఆరోపణలు చేసిన వారికి సీబీఐ ఛార్జ్‌షీట్‌ చెంపపెట్టు
  • విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా
  • నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది
  • మొదటి నుంచి విచారణ పారదర్శకంగా జరిగింది
  • సీబీఐ విచారణలో కూడా నా పాత్ర లేదని తేలింది

11:30 AM, Feb 4, 2024
ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌ కామెంట్స్‌

  • నేను చంద్రబాబు గురించి తెలుసుకున్నా..
  • ఓడిపోతే చంద్రబాబు అసహనానికి గురవుతారు..
  • చంద్రబాబుతో నాకు ఫ్రెండ్‌ షిప్‌ కూడా ఉంది
  • అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం కూడా..
  • చంద్రబాబుతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పాను
  • కొద్ది రోజుల క్రితం ఆయన్ను (బాబు) కలవటం కూడా జరిగింది
  • నేను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయటం లేదని, ఆ పని విడిచిపెట్టానని చెప్పాను
  • ఇటు మీకు (చంద్రబాబు), అటు సీఎం జగన్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వలేను
  • (మీరు గెలుపు-ఓటములలో నా ప్రమోయం ఉండదు)

11:13 AM, Feb 4, 2024
చరిత్రను సీఎం జగన్‌ తిరగరాశారు: గూడూరి ఉమాబాల

  • భీమవరం మావుళ్ళమ్మను దర్శించుకున్న వైఎస్సార్‌సీపీ నర్సాపురం పార్లమెంటరీ సమన్వయకర్త ఉమాబాల
  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గ్రంథిశ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమాబాల 
  • రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ సీటును  బీసీ మహిళకు కేటాయించి సీఎం జగన్‌ చరిత్రను తిరగరాశారు.
  • ఎంపీ సీటును బీసీ మహిళయిన తనకు కేటాయించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.
  • బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది సీఎం జగన్‌ మాత్రమే
  • ప్రజలందరి సహకారంతో నరసాపురం ఎంపీ సీటును సీఎంకు కానుకగా ఇస్తాం

11:02 AM, Feb 4, 2024
ఎన్నికల యుద్దం మొదలైంది: రావెల కిషోర్‌బాబు

  • సంపన్న వర్గాలకు, వెనుక బడిన వర్గాలకు మధ్య జరుగుతున్న యుద్దం
  • సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలని జగన్ ప్రయత్నిస్తున్నారు
  • అంబేద్కర్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు
  • 120 సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయి.
  • ప్రపంచంలోనే ఇదొక రికార్డ్

10:59 AM, Feb 4, 2024
ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు: మంత్రి పెద్దిరెడ్డి

  • 2024 ఎన్నికల్లో చంద్రబాబు,నారా లోకేష్ గెలిచిపోయినట్లు కలలు కంటున్నారు.
  • ఎవరికి ఏ శాఖ కావాలో కాగితాలపై రాసుకుంటున్నారు
  • రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయం
  • అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని ప్రజలు నమ్మరు
  • టికెట్టు ఇవ్వనివారు అసంతృప్తితో వెళ్లడం సహజం
  • కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు చేరుకుంది
  • ఆ పార్టీకి అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారు
  • తిరుపతి: అటవీశాఖ వన సంరక్షణ వాహనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • 70 డివిజన్ల కోసం వాహనాలను కొనుగోలు 

10:52 AM, Feb 4, 2024
మాడుగులలో టీడీపీ, జనసేనకు ఎదురుదెబ్బ

  • డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి జనసేన, టీడీపీ నాయకులు చేరిక
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన దుకాణం మూసుకోవాల్సిందే: ముత్యాల నాయుడు
  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం నల్లేరు మీద నడకే
  • ఏలూరు సిద్ధం సభతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి
  • మారుమూరు గ్రామలకు సైతం అభివృద్ధిని సీఎం జగన్ తీసుకువెళ్తున్నారు
  • సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు.. 
     

10:36 AM, Feb 4, 2024
మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్

  • నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఛార్జ్‌ షీట్ దాఖలు చేసిన సీబీఐ
  • ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్‌ షీట్ లో పేర్కొన్న సీబీఐ
  • మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌ షీట్‌లో తెలిపిన సీబీఐ
  • ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు
  • 88 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ
  • సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ
  • మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన సీబీఐ
  • ఏపీ పోలీసుల విచారణను సమర్థించిన సీబీఐ
  • పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ లను దోషులుగా నిర్ధారించిన సీబీఐ
  • దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్‌ షీట్ లో స్పష్టం చేసిన సీబీఐ
  • హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ
  • సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో ముందే చెప్పిన మంత్రి కాకాణి
  • సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులోను కోరిన మంత్రి కాకాణి
  • సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి తెలిపిన అడ్వకేట్ జనరల్
  • సీబీఐ ఛార్జ్‌ షీట్ తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్
  • రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్‌ షీట్ తో పటాపంచలు

10:06 AM, Feb 4, 2024
దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం 

  • అందుకు ప్రతి కార్యకర్తా సైనికుడై కదలాలి 
  • రాష్ట్రంలో మరోసారి సంక్షేమ పాలన సాధిద్దాం 
  • సిద్ధం సభలో వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు 
  • గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి
  • పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు.
  • వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా..
  • ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు
  • కానీ సీఎం జగన్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.
  • గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా..
  • ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్‌ సుపరిపాలన వల్లే

9:44 AM, Feb 4, 2024
అరవయ్యా.. ఇరవయ్యా..!

  • జనసేన–టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయతీ 
  • అధినేత తీరుపై మండిపడుతున్న జనసేన నేతలు
  • ఎన్ని సీట్లలో, ఏ సీట్లలో జనసేన పోటీచేస్తుందో తెలీక పార్టీలో నిస్తేజం
  • ఎన్నికల ముందు దయనీయ పరిస్థితి
  • 4 నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం 
  • చివరిగా కాకినాడలో కార్యకర్తల మీటింగ్‌లు పెట్టి కూడా నెలరోజులపైనే.. 
  • పార్టీని పవన్‌ మోసం చేస్తున్నారని అభిమానుల ఆగ్రహం.. 
  • చివరి నిమిషంలో అరకొర సీట్లు తీసుకునేందుకే కాలయాపన అంటూ మండిపాటు 

8:35 AM, Feb 4, 2024
టీడీపీ వెన్నులో వణుకు..

  • వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభల జయప్రదంతో అంతర్మథనం
  • చంద్రబాబు రా.. కదలి రా.. విఫలంపై ఆవేదన
  • ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభలు
  • తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి
  • ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్న టీడీపీ
  • జగన్‌ జన బలం సుప్రసిద్ధమే
  • అయితే గత వారం భీమిలిలో జరిగిన సభతో పాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకుమించి సూపర్‌ సక్సెస్‌
  • రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం
  • దీంతో పూ­ర్తిగా అంతర్మథనంలో పడిపోయిన టీడీపీ
  • ‘రా కదలి రా’ అట్టర్‌ ఫ్లాప్‌తో ఆవేదన  

7:58 AM, Feb 4, 2024
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు: మాజీ ఎంపీ ఉండవల్లి

  • ఉచితాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని ప్రకటించిన చంద్రబాబు
  • అంతకంటే ఎక్కువ డబ్బులు పంచుతానని చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
  • సంక్షేమ పథకాలకు ఇంత పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసిన చరిత్ర ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్క­డా లేదు
  • జగన్‌ కాకుండా చంద్ర­బాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ రద్ద­వుతాయని, తాము నష్టపోతామనే అవగాహ­న ప్రజలకు ఉంది
  • అందుకే రాబో­యే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకోవాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు
  • అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడంలో బీజేపీ ప్రభు­త్వం మొదటి స్థానంలో నిలిచింది

7:35 AM, Feb 4, 2024
నారాయణ ఎన్నికల కు‘తంత్రం’ 

  • విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్‌ కాల్స్‌   
  • కుటుంబ సమాచారంతోపాటు ఓటర్‌ ఐడీకార్డు నంబర్ల సేకరణ 
  • నారాయణ విద్యాసంస్థలను ఎన్నికల కేంద్రాలుగా మార్చేసుకున్న వైనం 
  • ఉద్యోగుల ద్వారానే ఎన్నికల సమాచారం సేకరణ 

7:14 AM, Feb 4, 2024
జగన్‌ ప్రభం‘జనం’

  • మరోసారి చాటిచెప్పిన ఏలూరు ‘సిద్ధం’ సభ కిక్కిరిసిన 110 ఎకరాల ప్రాంగణం 
  • సభా ప్రాంగణంలో ఖాళీ లేక జాతీయ రహదారిపై నిలబడిన లక్షలాది మంది 
  • విజయవాడ వైపు 15 కి.మీలు.. రాజమహేంద్రవరం వైపు 17 కి.మీల మేర నిలిచిన వాహనాలు 
  • హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు యువతే
  • జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని విశ్వసిస్తోన్న యువత 
     

7:08 AM, Feb 4, 2024
మీరే సారథులు

  • సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వమే రావాలి 
  • మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధం కావాలి
  • దెందులూరు ఎన్నికల శంఖారావ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు
  • మీ జగన్‌ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే  
  • 57 నెలల్లో జరిగిన మంచిపై పెత్తందారులు దాడి చేస్తున్నారు
  • సంక్షేమాభివృద్ధిపై దండయాత్ర చేస్తున్నారు 
  • 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి  
  • మన ప్రభుత్వ హయాంలోనే 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
  • కొత్తగా ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్లు..
  • ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత మన హయాంలోనే
  • ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మళ్లీ లంచాల వ్యవస్థ వస్తుంది 
  • పేదల సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలని అందరికీ చెప్పండి
  • కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత కొనసాగాలంటే మళ్లీ మనం గెలవాలి 
     

7:02 AM, Feb 4, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల టెన్షన్ టెన్షన్ 

  • వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తోన్న టీడీపీ 
  • పార్ధసారథి, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమంటున్న పార్టీ నేతలు
  • తిరువూరు నియోజకవర్గంలో తెరపైకి కొలికలపూడి శ్రీనివాసరావు
  • ఆందోళనలో ప్రస్తుత తిరువూరు ఇంచార్జ్ శావల దేవదత్
  • పార్ధసారథిని నూజివీడుకి ఒప్పించేందుకు టీడీపీ హైకమాండ్ నానా హైరానా
  • మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ
  • దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్
  • ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేందుకు ప్రయత్నాలు
  • ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు
  • విజయవాడ పశ్చిమ టీడీపీ లో గందరగోళం
  • బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు
  • పొత్తులో భాగంగా జనసేన కు ఇచ్చే సీట్లపై రాని క్లారిటీ
  • విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలు జనసేనకు అంటూ ప్రచారం
  • నూజివీడులో ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు
  • తనని విస్మరిస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ ముద్రబోయిన హెచ్చరికలు

7:01 AM, Feb 4, 2024
టీడీపీ, జనసేన మధ్య పొత్తుల కత్తులు

  • ఉమ్మడి కృష్ణాలో మూడు సెగ్మెంట్లపై టీడీపీ, జనసేన మధ్య టికెట్ల పితలాటకం
  • కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన స్థానాలపై జనసేన ఫోకస్ 
  • ఇన్ ఛార్జ్ లేకపోయినప్పటికీ అవనిగడ్డలో జనసేనకు కేడర్ 
  • అవనిగడ్డ టికెట్ ఆశిస్తోన్న జనసేన నేత బండ్రెడ్డి రాము 
  • టీడీపీ నుంచి రేసులో మండలి బుద్ధ ప్రసాద్ 
  • పెడన స్థానంలో బలంగా ఉన్న టీడీపీ, జనసేన 
  • పెడన ఇన్‌ఛార్జ్‌గా పంచకర్ల రమేష్ ను నియమించిన పవన్ 
  • జనసేనలో చేరి పెడన నుంచి బూరగడ్డ వేదవ్యాస్ పోటీ? 
  • ఎన్టీఆర్ జిల్లాకు కీలక స్థానం విజయవాడ పశ్చిమ 
  • టికెట్ కోసం జనసేన ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ ప్రయత్నాలు 
  • ఇప్పటికే టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ బలప్రదర్శన 
  • పవన్ ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరిన జలీల్ ఖాన్

Advertisement
Advertisement