మాలో మాకు విద్వేషాలు నింపొద్దు బాబు: ఏపీ మంత్రి

22 Jun, 2021 14:31 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కులాలను వాడుకుని రాజకీయం చేస్తున్నారని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. క్షత్రియుల పేరుతో చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్‌పై యాడ్ ఇప్పించారని మండిపడ్డారు. ఏ వ్యక్తి పేరు లేకుండా క్షత్రియులు అని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. క్షత్రియులు అన్ని పార్టీల్లో ఉన్నారని, ఈ రోజు తమ కమ్యూనిటీని వాడుకుని బాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

రెడ్డి కమ్యూనిటీని రఘురామకృష్ణంరాజుతో చంద్రబాబుతిట్టిస్తున్నాడని మంత్రి మండిపడ్డారు. ట్రస్టుల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిచేస్తుందని, ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. మాలో మాకు విద్వేషాలు నింపొద్దని చంద్రబాబుకి సూచించారు. అసలు ఊరు పేరు లేకుండా ప్రకటన ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.

చదవండి:
టీడీపీ కార్పొరేటర్‌ భూ దందాలకు అదుపే లేదు
ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు