ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్‌ ఫైర్‌

11 Aug, 2022 20:22 IST|Sakshi

Arvind Kejriwal Slams Centre.. దేశవ్యాప్తంగా పలు పొలిటికల్‌ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేసి పలు సందర్భాల్లో నిప్పులు చెరిగారు. కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపారు. 

తాజాగా మరోసారి.. బీజేపీని టార్గెట్‌ చేసి ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేట్ సంపన్నుల రుణాల‌ను రూ 10 ల‌క్ష‌ల కోట్లు మాఫీ చేసిన కేంద్రం మ‌రోవైపు పేద‌ల‌పై ప‌న్ను భారాలు మోపుతోంద‌ని కేజ్రీవాల్ మండిప‌డ్డారు. బియ్యం, గోధుమ‌ల‌ను కొనుగోలు చేసే యాచ‌కుడు, నిరుపేద సైతం ప‌న్ను చెల్లించాల్సిన పరిస్ధితి నెల‌కొంద‌ని విరుచుకుపడ్డారు. 

2014లో కేంద్ర బడ్జెట్‌ రూ. 20 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం అది రూ. 40లక్షల కోట్లకు చేరుకుంది. అందులో దాదాపు రూ. 10లక్షల కోట్లు బడా వ్యాపారవేత్తలు, వారి మిత్రుల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్రం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. పెద్ద కంపెనీలకు సైతం కేంద్రం రూ. 5 లక్షల కోట్లను మాఫీ చేసిందని విమర్శలు గుప్పించారు. పెట్రోల్‌, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 ల‌క్ష‌ల కోట్లు కేంద్రం వ‌సూలు చేస్తోంద‌ని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో సైనికుల‌కు పెన్ష‌న్ చెల్లించేందుకు కూడా నిధుల కొరత ఉందని సాకులు చెబుతోందని ఆరోపించారు. పేద ప్రజలు బియ్యం, గోధుమలు కొనాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందని దుయ్యబట్టారు. 

ఇది కూడా చదవండి: బెంగాల్‌ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్‌?

మరిన్ని వార్తలు