‘దళితబంధు’ ఇవ్వకుంటే వీపు విమానంమోతే..: బండి సంజయ్‌

10 Nov, 2021 08:51 IST|Sakshi
డప్పు వాయిస్తున్న సంజయ్, తరుణ్‌ఛుగ్, ఈటల, విజయశాంతి

కేసీఆర్‌కు బండి సంజయ్‌ హెచ్చరిక

ఆయన్ను సరైన సమయంలో టచ్‌ చేస్తాం

సీఎం అంటే.. మందు తాగుతూ, చికెన్‌ తల నరికినట్లు అనుకుంటున్నావా..

ఎస్సీ మోర్చా డప్పుల ర్యాలీలో తీవ్ర వ్యాఖ్యలు

తల నరుకుతా అన్నావు కదా, ఎక్కడికి రావాలో చెప్పు

KCR Vs Bandi Sanjay: కవాడిగూడ(హైదరాబాద్‌): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు రూ.10 లక్షల దళితబంధు ఇవ్వకుంటే సీఎం కేసీఆర్‌ వీపు విమానం మోతే, ఆయన్ను సరైన టైమ్‌లో టచ్‌ చేస్తా మని బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. నయా నిజాం కేసీఆర్‌ పాలనను సమాధి చేసి రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యా ప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాం డ్‌ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీగా డప్పుల ర్యాలీ నిర్వహించారు. సంజయ్‌ మాట్లాడుతూ దళితులు, పేదల కోసం తల నరుక్కోవడానికి తాను సిద్ధమని, మరి కేసీఆర్‌ సిద్ధమా.. అని ప్రశ్నించారు. ‘‘నా కొడక తల నరుకుతా..’ అన్నావు కదా.. సమయం, తేదీ ప్రకటించు. ప్రగతి భవన్‌కు రావాలో, ఫామ్‌హౌస్‌కు రావా లో చెబితే, అక్కడికే వస్తా.. ఆరు ముక్కలు కాదు, నా తల పది ముక్కలు నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’అని ప్రతిసవాల్‌ విసిరారు. 

ఇక గల్లీగల్లీలో డప్పులమోత...
దళితబంధును అమలు చేయకుంటే వదిలేది లేదు. గ్రామగ్రామాన, గల్లీగల్లీలో డప్పుల మోత మోగిస్తామని సంజయ్‌ స్పష్టం చేశారు. ‘హుజూరాబాద్‌లో 17 వేల మంది లబ్ధిదారుల కు డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిం చాలి, ఆ డబ్బులు నేటికీ ఎందుకియ్య లేదు. నీ అయ్య, తాత జాగీరా.. నీ జేబుల నుంచి ఇస్తు న్నావా... లేక ఫామ్‌ హౌస్‌లో ముద్రిస్తున్నా వా.. అని నిలదీశారు. కేసీఆర్‌ గద్దె దిగి దళితు డిని సీఎంగా చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు హామీలు నేటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించిన నేపథ్యంలో 22 రాష్ట్రాలలో కూడా  వ్యాట్‌ తగ్గించారని, సీఎం కేసీఆర్‌ సైతం బేషరతుగా తగ్గించాలని అన్నారు. ‘కేసీఆర్‌ మీడియాతో సోయి తప్పి మాట్లాడు తున్నారు, సీఎం అంటే.. రోజూ టైంపాస్‌ చేసుకుంటూ, మందు తాగుతూ, చికెన్‌ తల నరికినట్లు అనుకుంటున్నావా’ అని ప్రశ్నించారు. 
 

చదవండి: (KTR: మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు)

కేసీఆర్‌కు చావుడప్పు తప్పదు..
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయక పోతే కేసీఆర్‌కు చావుడప్పు తప్పదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. తన ముఖం అసెంబ్లీలో చూడొద్దనుకొని కేసీఆర్‌ భంగపడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు రిటైర్మెంట్‌ ఇవ్వాలని భావిస్తున్నారని  మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కార్యక్ర మంలో బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, వివేక్, మునుస్వామి, విజయరామారావు, చంద్ర శేఖర్, కొప్పు భాషా తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (కేసీఆర్‌ బెదిరింపులకు బీజేపీ భయపడదు: కిషన్‌రెడ్డి)

మరిన్ని వార్తలు