సూసైడ్‌ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఆయన లేకపోతే..

5 Jan, 2023 17:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సేవనో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కుసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచిన సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. తాజాగా తాను సూసైడ్ చేసుకునే వాడినని కామెంట్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే తాను చనిపోయే వాడినని అన్నారు. ఎన్నో విధాలుగా తనకు అండగా నిలిచిన ‘నా అన్న, నా దేవుడి వెంట ఎప్పుడూ ఉంటా’.. రాజకీయాలు పక్కనపెట్టి రంజిత్ రెడ్డి కోసం పనిచేస్తానని బండ్ల గణేష్ అన్నారు.
చదవండి: కాల్‌ గర్ల్‌ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు

కాగా, కాంగ్రెస్ తరఫున 2018లో ప్రచారం చేసిన బండ్ల గణేష్.. ‘‘2018, డిసెంబర్ 11 ఉదయం 11 గంటల తర్వాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు సేవనో క్లాక్ బ్లేడ్‌ తీసుకురండి. ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోతే.. బ్లేడ్‌తో నా పీక కోసుకుంటా. ఇదే నా ఛాలెంజ్. హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటారో" అంటూ బండ్ల గణేష్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు.

కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఓటమి పాలైంది. సినీ నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు.

మరిన్ని వార్తలు