బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కాంగ్రెస్‌ అసమ్మతి నేతలపై ఫోకస్‌

19 Dec, 2022 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాం‍గ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. అంతర్గత విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ రెండుగా చీలింది. వలస నేతల వల్ల అస­లైన కాంగ్రెస్‌ నాయకులకు అవకాశం లేకుండా పో­తోందంటూ పలువురు సీనియర్లు శనివారం ఆరోపణలు చేయగా.. అదే రోజున రేవంత్‌ అనుచ­రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ అసమ్మతి నేతలపై బీజేపీ దృష్టి సారించింది. జాయినింగ్స్‌ కమిటీని బీజేపీ హైకమాండ్‌ అప్రమత్తం చేసింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌ అసమ్మతి నేతలు బీజేపీలోకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే పనిలో బీజేపీ నేతలు ఉన్నారు.
చదవండి: రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు