బీజేపీ సీఎంలు ఎవరో..?

6 Dec, 2023 09:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ రాష్ట్రాల్లో మూడింటిటో బీజేపీ అధికారంలోకి రాగా తెలంగాణలో కాంగ్రెస్‌, మిజోరంలో జెడ్‌పీఎమ్‌ పవర్‌లోకి వచ్చాయి.  తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే సీఎం ఎవరో తేలిపోగా బీజేపీ పవర్‌లోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో ఇప్పటికీ ముఖ్యమంత్రులెవరో ఇంకా తేలలేదు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డినే సీఎంగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మిజోరంలో ఎక్కువ సీట్లు గెలిచిన జెడ్‌పీఎమ్‌ చీఫ్‌ లాల్డూహోమా సీఎం పదవి చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో సీఎం పదవికి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. 

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో పవర్‌లోకి వచ్చిన బీజేపీ నుంచి సీఎం పోస్టు కోసం మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ గట్టిపోటీదారుగా ఉన్నారు. రాజస్థాన్‌లో సీఎం పదవి రేసులో మాజీ సీఎం వసుంధరరాజేతో పాటు బాబా బాలక్‌నాథ్‌, దియాకుమారీలు పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేరే మళ్లీ వినిపిస్తోంది. అయితే త్వరలోనే బీజేపీ ఈ రాష్ట్రాల్లో  సీఎంలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్‌ హత్య..గెహ్లాట్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు!

>
మరిన్ని వార్తలు