సచిన్‌ పైలట్‌పై గెహ్లాట్‌ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

6 Dec, 2023 11:37 IST|Sakshi

జైపూర్‌: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజస్థాన్‌ కేర్‌టేకర్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను ఒక్కొక్కటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ హత్య కేసులో గెహ్లాట్‌పై బీజేపీ ఆరోపణలు చేస్తోంది.మరోవైపు గెహ్లాట్‌ దగ్గర ఐదేళ్లు ఓఎస్డీగా పనిచేసిన శర్మ కొత్త బాంబు పేల్చాడు.

రాజస్థాన్‌ ప్రభుత్వం 2020లో సంక్షోభంలో పడినప్పుడు  రాష్ట్రంలో మరో సీనియర్‌ నేత సచిన్‌పైలట్‌ ఫోన్‌ ట్యాప్‌ చేయడంతో పాటు ఆయన కదలికలపై గెహ్లాట్‌ నిఘా ఉంచారని చెప్పారు. తాజాగా ఓఎస్డీ శర్మ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ విచారణకు డిమాండ్‌ చేస్తోంది. ఇదే విషయమై ప్రస్తుతం రాజస్థాన్‌ సీఎం రేసులో ఉన్న దియాకుమారి స్పందించారు.

‘సచిన్‌ పైలట్‌పై నిఘా పెట్టడం, ఆయన ఫోన్‌ ట్యాప్‌ చేయడం వంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి.స్వయంగా సీఎం ఓఎస్డీ చెప్పాడంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇలా గూఢచర్యం చేయడం చట్ట విరుద్ధం’ అని దియాకుమారి వ్యాఖ్యానించారు. 

దియాకుమారి ఆరోపణలపై ఓఎస్డీ శర్మ స్పందించారు. సాధారణంగా రాజకీయ సంక్షోభాలు ఏర్పడినపుడు అందుకు కారణమైన వారిని ఫాలో చేస్తాం. వారు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారో తెలుసుకుంటాం. సంక్షోభాన్ని నివారించేందుకు ఇలాంటివి సహజమే’అని శర్మ వ్యాఖ్యానించారు. 

ఇదీచదవండి..బీజేపీ సీఎంలు ఎవరో..?


 

>
మరిన్ని వార్తలు