‘మోదీ డ్రామా.. బహిరంగ సభకు జనం రాలేదనే..’

9 Jan, 2022 16:27 IST|Sakshi

ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారు..

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: పంజాబ్‌ పర్యటనలో మోదీ డ్రామాలాడారని.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బహిరంగ సభకు జనం రాలేదని నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు.

చదవండి: పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్‌పై విమర్శలా? 

‘‘పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. 371డి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎల్పీ నుండి లేఖ రాస్తున్నాం. ధ్యానం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కొనుగోలు చేయాల్సిందే. తామర పురుగుతో లక్షల ఎకరాల మిర్చి పంటకు నష్టం ఏర్పడింది.  పసుపు, పత్తి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలి.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దయనీయ పరిస్థితిలో ఉంది. పోలీసులు యంత్రాంగాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ తన క్యాడర్ గా మార్చుకుంది. సీఎల్పీ బృందం.. గవర్నర్‌తో పాటు రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంచితే పోరాటం చేస్తాం. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని, వనమాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలంటూ భట్టి​ విక్రమార్క డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు