కేసీఆర్‌ బిగ్‌ ప్లాన్‌.. బీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్తలు వీరే.. 

14 Mar, 2023 01:24 IST|Sakshi

జాబితా విడుదల చేసిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల నిర్వహణకు దిశానిర్దేశం  

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా చేపట్టే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలను జిల్లాలవారీగా నాయకులకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆయా జిల్లాల సమన్వయకర్తల జాబితాను సోమవారం విడుదల చేశారు.

నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి ఆతీ్మయ సమ్మేళనాలు మొదలుకొని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, విద్యార్థి విభాగం సమావేశాలు.. ఇలా అనేక కార్యక్రమాలను రాబోయే నాలుగు నెలల్లో పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన వివిధ స్థాయిల నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులను సమన్వయం చేసేందుకు వీరిని నియమించినట్లు కేటీఆర్‌ తెలిపారు.

ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఈ బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక, అమలుపై చర్చించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. 

జిల్లాలవారీగా బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలు వీరే..

జిల్లా    –     సమన్వయకర్త 

హైదరాబాద్‌    –     దాసోజు శ్రవణ్‌  
వనపర్తి, జోగుళాంబ గద్వాల    –    తక్కళ్లపల్లి రవీందర్‌ రావు  
మేడ్చల్‌    –     పల్లా రాజేశ్వర్‌ రెడ్డి  
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల    –    బస్వరాజు సారయ్య 
నల్లగొండ    –     కడియం శ్రీహరి  
వికారాబాద్‌     –     పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి  
రంగారెడ్డి     –     ఎల్‌.రమణ  
భద్రాద్రి కొత్తగూడెం    –    టి.భానుప్రసాద్‌ రావు  
సంగారెడ్డి    –    వెంకట్రాంరెడ్డి  
మెదక్‌    –    ఎగ్గే మల్లేశం  
మహబూబ్‌నగర్, నారాయణపేట    –    కసిరెడ్డి నారాయణరెడ్డి  
యాదాద్రి భువనగిరి    –    యాదవరెడ్డి  
నాగర్‌ కర్నూల్‌    –    పట్నం మహేందర్‌ రెడ్డి  
భూపాలపల్లి, ములుగు    –    అరికెల నర్సారెడ్డి  
సిద్దిపేట    –    బోడకుంట్ల వెంకటేశ్వర్లు  
హనుమకొండ, వరంగల్‌     –     ఎమ్‌.ఎస్‌.ప్రభాకర్‌ 
నిర్మల్, ఆదిలాబాద్‌    –     వి.గంగాధర్‌ గౌడ్‌  
మంచిర్యాల, ఆసిఫాబాద్‌    –     నారదాసు లక్ష్మణ్‌ 
జనగామ    –     కోటిరెడ్డి  
మహబూబాబాద్‌     –     పురాణం సతీశ్‌  
కామారెడ్డి    –     దండే విఠల్‌  
నిజామాబాద్‌    –     బండ ప్రకాశ్‌  
జగిత్యాల     –     కోలేటి దామోదర్‌  
పెద్దపల్లి    –    ఎర్రోళ్ల శ్రీనివాస్‌ 
ఖమ్మం     –    శేరి సుభాష్‌రెడ్డి 
సూర్యాపేట    –    మెట్టు శ్రీనివాస్‌. 

మరిన్ని వార్తలు