సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్‌ గెలిచింది: నారాయణ 

18 Dec, 2023 21:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని నారాయణ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తమ పార్టీతో పొత్తు లేకపోవడంతో మిగతా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోడిందని అన్నారు. 

కాగా, సీపీఐ నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీకి 90-100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయని తెలిపారు. మిగితా రాష్ట్రాలో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌ఢ్‌లో అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా గతంలో వచ్చిన సీటలును ఆ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఏఐసీసీ ముఖ్యంగా దీనిని గమనించాలని తెలిపారు. 

ఆయా రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని ఉంటే తమ పార్టీ ఓట్లు కూడా పడేవని, ఇవి ఎంతగానో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేవని కామెంట్స్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్‌ గెలిచినా.. ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమన్నారు. ఇండియా భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని నారాయణ చెప్పుకొచ్చారు. 

లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీ
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో నాలుగు, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్‌సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్ యాదవ్ మద్దతునిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామన్నారు. 

>
మరిన్ని వార్తలు