బాబు విడుదల పార్టీ.. మళ్లీ 'ఓటుకు కోట్లు'?

4 Nov, 2023 13:01 IST|Sakshi

సైకిల్‌లో ఉప్పొంగిన ఉత్సాహం

ఒకే గూటికి చేరిన హితులు

ఇన్నాళ్లు విడివిడిగా ప్రభుత్వంపై నిందలు

ఇప్పుడంతా ఒకే చోట చేరి మంతనాలు

హైదరాబాద్‌లో తాజాగా ఓ పార్టీ జరిగింది. అదేంటీ ఎన్నో జరుగుతాయి.. ఇందులో విచిత్రమేముందంటారా?. అది చంద్రబాబు జైలు నుంచి రిలీజ్‌ అయ్యారనే సంబరంలో జరిగిన పార్టీ. ఆయన ద్వారా లబ్ధి పొందిన నిర్మాత ఒకరు.. ఓ వందమందిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఇచ్చిన పార్టీ.  ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్న పార్టీ!. అన్నింటికి మించి ఈ పార్టీ ఓ ట్విస్ట్‌కు ముడిపడి ఉంది. అదేంటో చివర్లో చదివి తెలుసుకోండి..

చంద్రబాబు అరెస్ట్‌ పరిణామంపై టాలీవుడ్‌ పరిశ్రమ స్పందించలేదు. కానీ, ఆయన హయాంలో లబ్ధి పొందిన నలుగురు మాత్రం బహిరంగ మద్దతు ప్రకటించారు. టాలీవుడ్‌, ఇతరత్రులు స్పందించకపోవడంపై నందమూరి బాలకృష్ణ రియాక్ట్‌ అవుతూ.. ‘డోంట్‌ కేర్‌’ అని తెగ ఫీలైపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. బాబు జైలు నుంచి రీలీజ్‌ అయ్యే కొన్నిరోజుల ముందు సంఘీభావం పేరిట ఒక మీటింగ్‌ పెట్టి మమా అనిపించేశారు కొందరు సినీపెద్దలు. తాజాగా జరిగిన చంద్రబాబు రిలీజ్‌ పార్టీలో ఆ నలుగురైదుగురు.. వాళ్లకు కావాల్సిన వాళ్లో.. లేదంటే సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కనిపిస్తే ఫర్వాలేదు. కానీ, సినీయేతర వ్యక్తులు ఈ పార్టీలో సందడి చేశారు. పైపెచ్చు రాజకీయ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వంపై వేర్వేరు కోణాల్లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారంతా ఒక్క చోట చేరారు. అదే ఇక్కడ పెద్ద విశేషమే కదా మరి. 

పార్టీ ఎందుకంటే.. 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అభియోగాలు ఎదుర్కొని జైలు పాలయ్యారు చంద్రబాబు నాయుడు. ఆయన రాజమండ్రి జైల్లో 52 రోజులు గడిపారు. పైగా చేరిన నాటికంటే బయటకు వచ్చే నాటికి కిలో బరువు కూడా పెరిగారు. కానీ, బాబు జైల్లో ఉన్నంత కాలం కొందరు సహించలేదు. తిండి, నిద్రాహారాలు మాని చంద్రబాబు కోసం బెంగపెట్టుకున్నారు. చంద్రబాబుకి తమ సంఘీభావం ప్రకటిస్తూ ప్రకటనలు సైతం చేశారు. బాబు కోసం బెంగ పెట్టుకున్న ఆ పెద్దల కోసం జరిగిన పార్టీనే ఇది.  

అందరి ఎజెండా ఒక్కటే!
వీళ్లంతా వేర్వేరు రంగాలకు చెందిన వాళ్లు. విచిత్రంగా ఒక్కటై.. చంద్రబాబుకు అనుకూలంగా వాయిస్‌ వినిపించేవాళ్లు. సినిమాల ద్వారా కొందరు, మీడియా ద్వారా మరికొందరు, రాజకీయాల్లో ఇంకొందరు, సామాజిక సేవ ముసుగులో కొందరు, ఉద్యమాల రూపంలో మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ల ఎజెండా ఒకటే. ‘‘చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. మళ్లీ తమ సామాజిక వర్గానికి, తమ మనుష్యులకు దోచిపెట్టాలి’’. 

ఇది ఎక్స్‌పెక్ట్‌ చేయనిదే!
ఈ పార్టీ ఏపీ రాజకీయాలకే పరిమితం కాలేదు.  ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది. ఈ పార్టీలో తెలంగాణ ఎన్నికల చర్చ కూడా నడిచింది. కాంగ్రెస్‌ను గెలిపించాలని టీడీపీ తరపున ప్రతినబూనారు వీళ్లంతా. అందుకే పార్టీ ముగిసిన తర్వాత బాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డితో భేటీ జరిగినట్టు తెలుస్తోంది.

ఓటుకు కోట్లు..
కాంగ్రెస్‌ను గెలిపించేందుకు చంద్రబాబు అనుచరులు.. రేవంత్‌ రెడ్డి ముందు చాలా పెద్ద ఆఫర్‌ పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో మీకెంత డబ్బు కావాలి? ఎంత నగదు రూపంలో కావాలి? ఎక్కడెక్కడ డెలివరీ కావాలి? ఇలాంటి విషయాలు చర్చించినట్టు తెలిసింది. ఎంత డబ్బిస్తే .. మీరు గెలుస్తారు? ఇంకా ఎన్ని రకాలుగా మీకు సహకారం కావాలి అని ఓపెన్‌గా చంద్రబాబు తరపున రేవంత్‌కు వీళ్లు ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం.

రాబోయే ఎన్నికల్లోనూ..
పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల అంశం కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్ కి కూడా ఫండింగ్ చేయాలని ఈ వర్గాన్ని రాహుల్‌ తరపున రేవంత్‌ అడిగినట్టు తెలిసింది. ఆ సహకారం అందిస్తే.. టీడీపీకి మద్ధతుగా రాహుల్‌ను ఏపీలో మరిన్ని సభల్లో పాల్గొనేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 100 మీటింగ్స్ పెట్టాలి, అందులో 20 మీటింగ్స్‌కి రాహుల్ గాంధీ.. కనీసం 5 మీటింగ్స్ కి సోనియా రావాలి అని అడిగినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు