టీడీపీ మినీ మహానాడు వేదికగా అసమ్మతి నేతల బహిరంగ సవాల్‌

27 May, 2022 16:29 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: నగరి టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ మినీ మహానాడు వేదికగా అసమ్మతి నేతలు బహిరంగ సవాల్‌ విసిరారు. స్మగ్లర్‌, ఇసుక, లిక్కర్‌ మాఫియా నాయకుడు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, లేదంటే తెలంగాణలో మాదిరిగా ఏపీ టీడీపీ తయారవుతుందని మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో వలస నేతల నాయకత్వం వద్దంటూ తీర్మానం చేశారు.
చదవండి: మేకవన్నె పులి బాబూ!

మరిన్ని వార్తలు