అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్ల కలకలం..

30 Nov, 2021 16:06 IST|Sakshi

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్‌

Empty Liquor Bottles Found in Bihar Assembly Premises: బిహార్‌ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రమాణం చేసిన మరుసటి రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు వెలుగు చూసినందుకు గాను సీఎం నితిశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.
(చదవండి: లాలూ.. పుత్రోత్సాహం)

 

ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం.. విచారణ జరపడం ముఖ్యం.. స్పీకర్ అనుమతిస్తే ఈ అంశంపై దర్యాప్తు చేయమని చీఫ్ సెక్రటరీ, డీజీపీని కోరతాం’’ అని తెలిపారు. బిహార్‌లోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కి చెందిన నాలుగు పార్టీల శాసనసభ్యులు, సీఎం నితీశ్‌ కుమార్ మద్యపాన నిషేధ నిర్ణయానికి అనుకూలంగా సోమవారం తీర్మానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ చర్యకు మద్దతు ఇవ్వాలని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు.
(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ పెళ్లి ఆపేందుకు ప్రియుడి స్కెచ్‌.. ఏకంగా సీఎంకే)

రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో నితీష్ కుమార్ ప్రభుత్వం విఫలమైందని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే ప్రతిపక్షాలు విమర్శించాయి. నితీష్‌ కుమార్‌ ప్రకటించని మద్యపాన నిషేధాన్ని కేవలం కంటితుడుపు చర్యగా పేర్కొన్నారు తేజస్వీ యాదవ్. "నితీష్ కుమార్ ప్రభుత్వంలోని పోలీసులు మద్యం వినియోగదారులను అరెస్టు చేస్తున్నారు, అయితే అసలు నిందితులుగా ఉన్న మద్యం మాఫియాడాన్‌లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అధికారులు పేదలను మాత్రమే అరెస్ట్‌ చేస్తున్నారు" అని విమర్శించారు. 

చదవండి: రణరంగంగా బిహార్‌ అసెంబ్లీ.. మగాడివైతే చంపు..

మరిన్ని వార్తలు