గెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో చూపిస్తాం: కవిత

23 Nov, 2020 17:53 IST|Sakshi

అభివృద్ధి అంటే మోఖిలాలో 50 ఎకరాలు తీసుకోవడమేనా?

సాక్షి, హైదరాబాద్‌: శంకర్‌ మాటలు సినిమా స్క్రిప్ట్‌కే పనికి వస్తాయి. అభివృద్ధి అంటే మోఖిలాలో 50 ఎకరాలు తీసుకోవడమేనా అని సినీ నటుడు సీవీఎల్‌ నరసింహరావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ.. ‘హిందూవులకు అండగా ఉంటామన్నందుకు ఇంత రచ్చ చేస్తారా?. అరాచకాలు.. అల్లకల్లోలం చేస్తున్నారు అంటారా?. హిందువులను చంపేస్తా... ఆవులను చంపేస్తా అంటే అప్పుడు మాట్లాడలనిపించలేదా?. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎవరూ వెళ్ళొదనుకుంటున్నారా?. సినిమా అభివృద్ధికి ఫిలిం డెవలప్‌మెంట్ అభివృద్ధి లేదు. ప్రభుత్వం తరఫున తెలంగాణ డైరెక్టర్‌లకు సాయం లేదు. చిత్రపురిలో అర్హులకు ఎందుకు ఇల్లు ఇప్పించడం లేదు?. సినిమా వాళ్లు కాని వాళ్ళను ఎందుకు పంపించడం లేదు?. సినీ అవార్డులు ఇస్తున్నారా.. పక్క రాష్ట్రం వారు ఇస్తే పోయి తెచ్చుకుంటున్నారు. సినిమా రంగంలో తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉన్నారా?.చిత్తశుద్ధి ఉండాలి.తెలంగాణ సినిమాను చంపేశారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. (చదవండి: మరింత హీటెక్కనున్న విశ్వనగర పోరు )

గ్రేటర్‌లో గెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో చూపిస్తాం: కవిత
అనంతరం సినీ నటి కవిత మాట్లాడుతూ.. ‘నగరం అస్తవ్యస్తంగా తయారైంది. గతుకుల రోడ్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నాలాల్లో చిన్న పిల్లలు పడి చనిపోతున్నారు. వరదల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టింకోలేదు. ప్రభుత్వం వివరాలు సేకరించి సాయం చేయాల్సింది పోయి... మీసేవలో అప్లై చేసుకోమంటూ చేతులు దులుపుకొన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను మీసేవ ముందు నిలబెట్టి ఓ మహిళ చావుకు కారణం అయ్యారు. కేటీఆర్ ప్రజలకు కావల్సింది మాటలు కాదు చేతలు. అన్ని రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.అవకాశవాదులుగా టీఆర్ఎస్ నేతలు వ్యహరిస్తున్నారు. ప్రజలను ఫూల్స్ అనుకోవద్దు. ఆరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలి. గ్రేటర్‌లో గెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో చూపిస్తాం. జీహెచ్‌ఎంసీ విజయం బీజేపీ కోసం కాదు.. ప్రజల కోసం కావాలి అన్నారు.

మరిన్ని వార్తలు