బీజేపీ పాలసీ అదే : కేటీఆర్‌

24 Nov, 2020 12:02 IST|Sakshi

బీజేపీ ఛార్జ్‌షీట్‌పై కౌంటర్ ఇచ్చిన కేటీఆర్‌

సాక్షి,  హైదరాబాద్‌ : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం  అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై షార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే  టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను నిలదీశారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అని విమర్శించారు. రైల్వే రంగాన్ని ఎందకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు