‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానం అందలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది’

17 Jan, 2023 17:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అసత్య ప్రచారాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఫైర్‌ అయ్యారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. 

కాగా, మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానం అందలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. నవంబర్‌ 25నే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దీనిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో సదస్సు ఏర్పాటు చేస్తున్నందున దావోస్‌ వెళ్లలేదు. ఐదుసార్లు దావోస్‌ వెళ్లి చంద్రబాబు ఏం తెచ్చారు?. గతంలో బిల్డప్‌ బాబును చూసి జనం ఆశ్చర్యపోయారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు