-

రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీష్ రావు

27 Nov, 2023 19:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ పాలన అంతా చీకటిమయమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్ కష్టాలు, నీటి కష్టాలను ప్రజలు ఏనాడూ మర్చిపోలేదని చెప్పారు. అర్ధరాత్రి రైతులను గోస పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలో నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మారిపోయాయని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అంటున్న నాయకునికి వారసుడు రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపాలని కుట్ర పన్నిందని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో రైతు బంధు రద్దు అయిందని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రైతు బంధు అవసరమా? అంటాడు.. రైతుల కష్టాలు తెలియని వారు సరైన పాలన ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్‌


 

మరిన్ని వార్తలు