Padma Awards 2022: గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌.. ‘ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు’

26 Jan, 2022 10:01 IST|Sakshi

న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మేరకు లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌ మాత్రం అజాద్‌కు అభినందనలు తెలిపారు. అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అతను అజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు గులాం అ‍వ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్పై పరోక్ష విమర్శలు గుప్పించారు.

అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎన్‌ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు 1973లో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి హస్కర్‌ పీఎంఓ నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్‌ను అందజేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దానిని ఆయన తిరస్కరించారు. హస్కర్‌ పుస్తకంలోని ఆ భాగం అ‍త్యత్తుమమైనది, అనుకరణ అర్హమైనది అనే క్యాప్షన్‌ జోడించి మరీ జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్‌పై నిర్ణయాన్ని భట్టాచార్య భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్‌ గురించి ఏమి తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నాను అని అన్నారు.

(చదవండి: యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌)

మరిన్ని వార్తలు