కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు..భూమేత : కేసీఆర్‌

20 Nov, 2023 15:48 IST|Sakshi

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాంగ్రెస్‌ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్‌ తీసుకొస్తారట కాంగ్రెస్‌ వాళ్లు తెచ్చేది భూమాత కాదు భూమేత అని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఛాన్సిస్తే మళ్లీ ఆగమాగమే అని ప్రజలను హెచ్చరించారు. 

 ఎన్నికలు రాగానే అబద్ధాలు ప్రచారం చేస్తారు. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి చూడండి. నీటి, కరెంట్‌ కష్టాలు తీర్చుకున్నాం. పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు. ఎంతో ఆలోచించిన తర్వాత రెండు వేలకు పెంచుకున్నం. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణప్రజల కోసం. 15 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మిషన్‌ భగీరథతో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నాం

అధికారంలో ఉన్నపుడు ఏం చేయకుండా కాంగ్రెస్‌ నేతలు మళ్లీ చాన్సివ్వమని అడుగుతున్నారు.  33 పార్టీలు మద్దతు ఇచ్చాక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో కనీసం తాగునీరు సరిగా ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లే కదా. రైతుబంధు ఉండాలా వద్దా. బీఆర్‌ఎస్‌ మళ్లీ వస్తే రైతుబంధు రూ.16 వేలు చేస్తాం. బీఆర్‌ఎస్‌ పాలనలో కంటి వెలుగు ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేయించాం. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 1.10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. తాము మోసపోయామని కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేస్తున్నారు’ అని కేసీఆర్‌ తెలిపారు. 

ఇదీచదవండి..మేడ్చల్‌.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయినట్టే

మరిన్ని వార్తలు