మోదీ అడ్డాలో కేజ్రీవాల్‌కు షాక్‌.. ఎయిర్‌పోర్టులో దిగగానే..

20 Sep, 2022 18:03 IST|Sakshi

వడోదర: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్‌లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టౌన్‌హాల్‌ సమావేశం కోసం ఆయన వడదోరలోని ఎయిర్‌పోర్టులో దిగగానే 'మోదీ, మోదీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఓ గుంపు ఆయనకు ఎదురుపడింది.

అయితే కేజ్రీవాల్ మాత్రం వారికి చిరునవ్వుతో బదులిచ్చారు. మీడియా ప్రతినిధులంతా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తర్వాత సమావేశం నిర్వహిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత మంది ఆప్ అభిమానులు బీజేపీకీ దీటుగా 'కేజ్రీవాల్, కేజ్రీవాల్' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత ప్రీతి గాంధీ స్పందిస్తూ.. 'మోదీ అడ్డా అయిన గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు సాదర స్వాగతం లభించింది' అంటూ సెటైర్లు వేశారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్.. గుజరాత్‌లోనూ పాగా వేసి 27ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ పట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆప్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి విజయం కోసం ఉత్సాహంతో పనిచేయాలని సూచిస్తున్నారు. 

గుజరాత్‌లో ప్రజలను ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రజలపై హామీల వర్షం కురిపించారు కేజ్రీవాల్. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి, ఢిల్లీ మోడల్ తరహాలో విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు.
చదవండి: బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం

>
మరిన్ని వార్తలు