చంద్రబాబు ఇక జన్మలో మళ్లీ సీఎం కాలేడు: మంత్రి కొడాలి నాని

17 Feb, 2022 17:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇక జన్మలో మళ్లీ సీఎం కాలేడని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. కావాలనే  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌పై బురద జల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబును ఉన్న పళంగా సీఎం చేసేయాలని ఎల్లో మీడియా తాపత్రయపడుతోందని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి అనేక రాష్ట్రాల ధాన్యం ఎగుమతి అవుతోందని తెలిపిన మంత్రి.. ధాన్యం ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టుది అగ్రస్థానమని పేర్కొన్నారు. రైతులు పండించే పంటల వివరాలు ఈ క్రాప్‌ యాప్‌లో ఉంటాయని, అన్నీ రికార్డులు ఆన్లైన్‌లో ఉంటాయన్నారు. సన్నబియ్యం ఎగుమతిలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక్క ఏపీ నుంచే కాదని.. బీహార్, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతోందన్నారు.

‘ఈనాడులో విదేశాలకు బియ్యం అనే వార్త రాశారు. చంద్రబాబు, ఆయనకి తోకలుగా ఉన్న పార్టీలు, ఆయన్ని సీఎంను చేయాలని తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదు. విదేశాలకు ధాన్యం ఎగుమతి అవుతోందని, కేజీ 25కి మాత్రమే ఎగుమతి చేస్తోందని రాశారు. రైతుల శ్రమను దోచుకుంటున్నట్లు రాశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం మీ తరం కాదు. అందుకే జగన్ గారిని బ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్నారు.  పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిపై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వయసు పెరిగినా చిన్నవాడైన జగన్‌పై ఏడుస్తున్నారు.
చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోంది’

45లక్షల టన్నులు ధాన్యం సేకరణ వస్తుందని మేము అంచనా వేశాం. 6660 కోట్లకు 3300 కోట్లు రైతులకు చెల్లించాము. ఇచ్చిన మాట కోసం ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా 24 రోజుల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం. డిసెంబర్‌లో పంట నష్టపోతే ఫిబ్రవరిలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉంది. జగన్ క్యారెక్టర్‌ను దిగజార్చాలని కోరుకునే వారికి ప్రజలు 2024లో బుద్ధి చెప్పాలి. చంద్రబాబు ఎంతమంది డీజీపీలను మార్చాడో చెప్పాలి . ఎంతమంది చీఫ్ సెక్రటరీలు మార్చాడు..? సవాంగ్ గారు వచ్చి చాలా కాలం అయ్యింది. వేరే వారికి అవకాశం ఇవ్వాలని మార్చారు. 

నేను మాట్లాడితే రెండు రోజులు గుక్కపట్టి ఏడుస్తారు. పదవులు శాశ్వతం కాదు చంద్రబాబు...చరిత్ర శాశ్వతం . ఎన్టీఆర్, వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారు. జగనమోహన్ రెడ్డి కూడా చరిత్రలో నిలిచే పనులు చేస్తున్నారు. నీ డబ్బా మీడియాలో తప్ప జగన్ ప్రజల గుండెల్లో ఉంటాడు. కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని వ్యక్తి కుప్పంలో సర్పంచ్ గెలిపించుకోలేని వ్యక్తి సొల్లు పురాణం చెప్తున్నాడు. ఇలా వాళ్ళు మోరిగి మోరిగి 2024కి సొమ్మసిల్లి పడిపోతారు. చైల్డిష్ నాయకుడు పప్పుకు కార్టూన్‌లు చూడడం ఇష్టం.. అందుకే మాపై కార్టూన్ విడుదల చేసి ఉంటాడు. చివరికి ఆ పార్టీ కార్టూన్ పార్టీగా మిగిలిపోతుంది’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు