బాబు నుంచి పవన్‌కు రిపోర్టు వచ్చిందేమో: కొట్టు సత్యనారాయణ సెటైర్లు

11 Jul, 2023 15:51 IST|Sakshi

సాక్షి తాడేపల్లి: పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్‌ వ్యాఖ్యాలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఎవరిచ్చిన రిపోర్ట్ చదువుతున్నారో పవన్‌కు అసలు అర్థమవుతుందా అని ప్రశ్నించారు. బాహుశా అది చంద్రబాబు నుంచి వచ్చిన‌ నివేదిక ఏమోనని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం‌ పాటిస్తూ వాలంటీర్ల‌ నియామకం జరిగిందని తెలిపారు.  రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకున్నామని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. వాలంటీర్లు పాకిస్తాన్‌ వాళ్లేం కాదని, ప్రతీ 50 కుటుంబాలకు వాలంటీర్లను ఆయా కుటుంబాల నుంచే నియమించామని అన్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా అజ్ణానవాసిలా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో పవన్ ఒక్కడేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు