మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌

10 Dec, 2023 14:11 IST|Sakshi

లక్నో: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారుసుడిని ప్రకటించారు. ఆదివారం లక్నోలో బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఉత్తరప్రదేశ్‌, ఉత్తరఖండ్‌ మినహా మిగతా దేశంలో తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రకటించారు.

ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌, ఫలితాలపై చర్చించారు. అదే విధంగా 2024లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆకాశ్‌ ఆనంద్‌.. మాయావతి పాత్ర పోషించనున్నారు. 

గత ఏడాడి నుంచి ఆకాశ్‌ ఆనంద్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాయావతి చిన్న తమ్ముడి కుమారుడు. 2016లో పార్టీలో జాయన్‌ అయిన ఆనంద్‌.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో స్టార్‌ క్యాంపేయినర్‌గా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2022లో ఆయన రాజస్థాన్‌లోని అల్వార్‌లో 13 కిలో మీటర్ల ‘స్వాభిమాన్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. 2018 రాజస్థాన్‌లో బీఎస్పీ గెలుచుకున్న 6 సీట్ల విజయం వెనకాల ఆనంద్‌.. కీలకమని పోల్‌ క్యాంపేయినింగ్‌ వ్యూహాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతుంటాయి.

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సీఎం రేసులో వెనుకబడిన రమణ్‌ సింగ్‌!

>
మరిన్ని వార్తలు