‘చంద్రబాబు శవ రాజకీయాలు.. లోకేష్‌కు అప్పగించారు’

17 Aug, 2021 17:54 IST|Sakshi

టీడీపీ నేతలు యువతి మృతదేహాన్ని అడ్డుకోవడం దారుణం

 వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున

సాక్షి, అమరావతి: చంద్రబాబు శవ రాజకీయాలు.. లోకేష్‌కు అప్పగించారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలు యువతి మృతదేహాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. రమ్య హత్య ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని మేరుగ నాగార్జున హెచ్చరించారు. చదవండి: కుప్పకూలిన విమానం: షాకింగ్‌ వీడియో  

‘‘యువతి మృతదేహం ఉన్న వాహనాన్ని టీడీపీ జెండాలు వేసుకుని ఆపుతారా...? ఇది శవ రాజకీయం కాదా..? వచ్చిన లోకేష్ ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా...?  ఏదో విధంగా ప్రజల్ని మోసం చేయాలని హైడ్రామా చేశారు. సాయం చేయక పోగా ధర్నాలు చేయించి రాజకీయం చేస్తారా..? మీ ఆటలు ఈ రాష్ట్రంలో చెల్లవని’’ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.

ఇవీ చదవండి:
టీడీపీ శవరాజకీయాలు
పథకాలు పక్కదోవ పట్టించడానికే లోకేష్‌ హైడ్రామా

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు