-

‘మార్గదర్శి’ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా?: మంత్రి కాకాణి

16 Dec, 2022 16:27 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అడ్డగోలు రాతలు రాయడం ఎల్లో మీడియాకు అలవాటైపోయిందన్నారు.

‘‘నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదు. మార్గదర్శిపై రామోజీరావు పిటీషన్‌ వేయడం హాస్యాస్పదం. మార్గదర్శిలో ఏపీ స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేయొద్దా?. మార్గదర్శిలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా?. దమ్ముంటే మార్గదర్శిలో అవకతవకలు జరగలేదని నిరూపించుకోవాలి’’ అంటూ మంత్రి సవాల్‌ విసిరారు.

‘‘దోచుకునేందుకు చంద్రబాబు కంటే రామోజీకి ఎక్కువ ఆత్రంగా ఉంది. మేం రాసిందే రాత అని రామోజీరావు అనుకుంటే అది భ్రమే. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనేదే రామోజీ తాపత్రయం. రామోజీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను’’ అని మంత్రి కాకాణి అన్నారు.
చదవండి: మద్యం బ్రాండ్‌లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్‌ కింగ్‌  చంద్రబాబే..!

మరిన్ని వార్తలు