‘అబద్ధం చెప్పనిదే ఆయనకు పూట గడవదు’

6 Dec, 2020 19:50 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు చెప్పనిదే చంద్రబాబుకు పూట గడవడం లేదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు.. వారు పార్లమెంట్‌లో ఒకలా.. బయట మరోలా మాట్లాడతారని దుయ్యబట్టారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని బాబు యూటర్న్‌ తీసుకున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలు ఢిల్లీ పెద్దలకు అర్థం కావనే భావనలో ఉన్నారని ఆయన విమర్శించారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని మంత్రి ప్రశ్నించారు. (చదవండి: ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత)

‘‘ఎంఎస్‌పీ కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తర్వాతే మేం మద్దతు తెలిపాం. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎంఎస్‌పీ కొనసాగిస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పార్లమెంట్‌లో వివరించాం. రాష్ట్రంలో ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించాం. గ్రామ స్థాయిలో మార్కెటింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారిగా గ్రేడెడ్ ఎంఎస్‌పీని తీసుకొచ్చాం. నిల్వ ఉండని పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించాం. చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు మద్దతు ధర ప్రకటించలేదు. చంద్రబాబు రైతులకు మేలు చేసే ఆలోచన ఒక్కటైనా చేశారా?’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. (చదవండి: ఆ స్థాయి నిమ్మగడ్డకు లేదు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు