English

2023 అలంపూర్‌ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

28 Nov, 2023 18:03 IST|Sakshi

2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు:

డాక్టర్ S.A. సంపత్ కుమార్ (కాంగ్రెస్),విజయుడు (BRS),రాజగోపాల్ (BJP)

ఉద‌యం 9గం వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ శాతం: 9%

అలంపూర్‌ నియోజకవర్గం

జిల్లా: జోగులంబ గద్వాల్‌
లోక్ సభ పరిధి: నాగర్ కర్నూల్
రాష్ట్రం: తెలంగాణ
మొత్తం ఓటర్ల సంఖ్య:    236,136
పురుషులు:    116,989
మహిళలు:    119,080

 చ‌ద‌వండి: 2023 కల్వకుర్తి ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి:
అలంపూర్
ఇయీజా
ఇటిక్యల్
వడ్డేపల్లె
మానోపాడ్
రాజోలి
వడ్డేపల్లి

2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు:

డాక్టర్ S.A. సంపత్ కుమార్ (కాంగ్రెస్)
విజయుడు (BRS)
రాజగోపాల్ (BJP)

నియోజకవర్గం ముఖచిత్రం

అలంపూర్‌ నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. 2008లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వడ్‌ కేటగిరిలోకి వెళ్లిపోయింది. రిజర్వడ్‌గా మారిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. అలంపూర్‌ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ) కలిసి ఎనిమిది సార్లు గెలిచాయి. భారతీయ జనతా పార్టీ మూడుసార్లు, టీడీపీ రెండుసార్లు, జనతాపార్టీ ఒకసారి విజయాలు దక్కించుకున్నాయి. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌ కూడా ఒకసారి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా రావుల రవీంద్రనాధ్‌రెడ్డి బీజేపీ నుంచి మూడు సార్లు గెలిచారు. 2004లో ఇక్కడి నుంచి ఇండిపెండెట్‌గా గెలిచిన చల్లా వెంకటరామిరెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు.

2018లో

అలంపూర్‌ రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన మల్లెపోగు అబ్రహం గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ ఐ  పక్షాన ఒకసారి గెలిచిన అబ్రహం 2018లో టిఆర్‌ఎస్‌లో చేరి పోటీచేసి విజయం సాదించారు. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది సంపత్‌కుమార్‌  ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి సంపత్‌ను  అనుచిత ప్రవర్తన పేరుతో  బహిష్కరించడం వివాదం అయింది. ఆ సానుభూతి కూడా ఆయనకు పనిచేయలేదు. అబ్రహం 44670 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. అబ్రహంకు 102105 ఓట్లు రాగా, సంపత్‌ కుమార్‌కు 57426 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్‌.ఎప్‌.బి తరపున పోటీచేసిన హరిజన అబ్రహంకు 6800 ఓట్లు వచ్చాయి.

శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అలంపూర్‌  నియోజకవర్గం రిజర్వుడు కేటగిరిలోకి వెళ్ళింది. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్‌ ఐ పార్టీ, ఒకసారి టిఆర్‌ఎస్‌ గెలిచాయి. 2014లో కాంగ్రెస్‌  ఐ అభ్యర్ధి సంపత్‌ కుమార్‌, సిటింగ్‌ ఎమ్మెల్యే వి.ఎమ్‌.అబ్రహం ను 6730 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. అబ్రహం కాంగ్రెస్‌ ఐ నుంచి టిడిపిలోకి వెళ్లి పోటీచేశారు. ఇక్కడ 2014లో  టిఆర్‌ఎస్‌ తరపున పోటీచేసిన మాజీ ఎమ్‌.పి మందా జగన్నాధం కుమారుడు శ్రీనాద్‌ ఓడిపోయారు.

శ్రీనాద్‌కు 38136 ఓట్లు వచ్చాయి.కాగా 2014లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజక వర్గానికి టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన మందా జగన్నాధం కూడా ఓడిపోవడం విశేషం. అలంపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఎనిమిదిసార్లు, భారతీయ జనతాపార్టీ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్‌ఎస్‌ ఒకసారి, జనతా ఒకసారి గెలిచాయి. ఒక  ఇండిపెండెంటు కూడా నెగ్గారు. బిజెపి నేత రావుల రవీంద్రనాధరెడ్డి ఇక్కడ మూడుసార్లు గెలిచారు. రవీంద్రనాద్‌ రెడ్డి తదుపరి  కాంగ్రెస్‌ ఐలో చేరినా, టిక్కెట్‌ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా దేవరకద్రలో పోటీచేసి ఓడిపోయారు. అలంపూర్‌లో రెండుసార్లు గెలిచిన టి. చంధ్రశేఖర్‌ రెడ్డి, ఒకసారి గెలిచిన రజనీబాబులు సోదరులు.

అలాగే రెండుసార్లు శాసనసభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ కూడా వీరికి సోదరి అవుతారు. 1952లో ఇక్కడ గెలిచిన నాగన్న కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్‌లలో కలిపి నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన పి. పుల్లారెడ్డి, గద్వాలలో కూడా మరోసారి గెలిచారు. 2004లో గెలిచిన చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనుమడు అవుతారు. ఈయన తండ్రి రాంభూపాల్‌రెడ్డి మూడుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. కాగా అలంపూర్‌  రిజర్వు కావడానికి  ముందు తొమ్మిదిసార్లు రెడ్లు, నాలుగు సార్లు కమ్మ, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు.

చ‌ద‌వండి: 2023 గద్వాల ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

మరిన్ని వార్తలు