భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్‌: వరుదు కల్యాణి

22 Nov, 2023 21:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. సీఎం జగన్‌ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, వరుదు కల్యాణి బుధవారం వైజాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ తిరిగి పాలనలోకి రాదని తేలిపోయింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైన  తీరు బట్టి టీడీపీ ఓటమి ఖాయమని తెలిసిపోయింది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు శిఖండి లాంటి వ్యక్తి. టీవీ 5, ఈనాడు, ఏబీఎన్ చంద్రబాబు ఫొటో లేకుండా ఆయన కోసం పనిచేస్తున్నాయి. నారా భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్‌. 

వైఎస్సార్‌సీపీ నేతలు ఎప్పుడైనా టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను విమర్శించారా?. అనవసరంగా సీఎం జగన్‌ కుటుంబ సభ్యులను విమర్శిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోము’ అంటూ హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు