రసవత్తరం కానున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు

2 Dec, 2020 19:41 IST|Sakshi

టీఎంసీకి తలనొప్పిగా మారనున్న సువేందు అధికారి

294 అసెంబ్లీ స్థానాల్లో 30 నుంచి 50 మేర ప్రభావం చూపే అవకాశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) సీనియర్‌ నాయకుడు, తిరుగుబాటు నేత సువేందు అధికారి ఆ పార్టీకి తల నొప్పిగా మారనున్నారు. టీఎంసీ పార్టీ నాయకుడు సౌగతా రాయ్‌(49) అయిదుగు పార్టీ నాయకులతో రెండు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించారు. సువేందు నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. (చదవండి: పశ్చిమ బెంగాల్‌లో విషాదం, 11 మంది మృతి)

పార్టీలో మొదలైన ముసలం
టీఎంసీ యూత్‌ వింగ్‌ చీఫ్, డైమండ్‌ హార్బర్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ ఫిరాయించిన చాలా మంది బీజేపీలో చేరడంతో గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40 స్థానాలకు గానూ 18 గెలుచుకుంది.

మారనున్న సమీకరణాలు 
సువేందు పార్టీ మారకపోయినా.. పార్టీ నుంచి నిష్క్రమిస్తే మాల్డా, ముర్షిదాబాద్‌, పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నాపూర్‌ ప్రాంతాల్లోని స్థానిక నాయకులపై ప్రభావం చూపనుంది.  సువేందు పదవిని రద్దు చేసే వరకు ఈ ప్రాంతంలో ఆయన అధికారి పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా టీఎంసీ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు.

ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సువేందు మాట్లాడుతూ.. అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో అగ్రస్థానం చేరుకోవడానిక దొడ్డి దారి ఎంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బెనర్జీ స్పందిస్తూ... ‘‘నేను డైమండ్ హార్బర్ వంటి కఠినమైన నియోజకవర్గం నుంచి ఎంపీ కావడానికి పారాచూట్‌, నిచ్చెనను ఉపయోగించలేదు. డైమండ్ హార్బర్ నా సొంత నియోజకవర్గం. మా కుటుంబంలో వారు కూడా చాలా పదవులు కలిగి ఉన్నారు’ అని అన్నారు. మంగళవారం ఉత్తర కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు బెనర్జీ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు