అదానితో శరద్ పవార్.. ఏం జరుగుతోంది?

24 Sep, 2023 21:47 IST|Sakshi

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఆదానీకి చెందిన ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విపక్షాల ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ నేత ఆదానీతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇందులో అభ్యంతరం ఏముంటుంది? అదానీ శరద్ పవర్ మంచి స్నేహితులని అన్నారు. 

జయంత్ పాటిల్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఇండియా కూటమి అన్ని సమావేశాలకు శరద్ పవర్ హాజరయ్యారు. నిస్సందేహంగా కూటమిలో ఎన్సీపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఇక అదానీ శరద్ పవర్ ఇద్దరూ సన్నిహితులు. వారి మధ్య బంధం ఇప్పటిది కాదని అహ్మదబాద్‌లో ఆయన నిర్మించిన నూతన ఫ్యాక్టరీకి గౌరవ అతిధిగా ఆహ్వానించారు.పవార్ దానికి హాజరైతే తప్పేంటని ప్రశ్నించారు.    

ఎన్సీపీ నేత శరద్ పవర్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఫోటోలతో పాటు శరద్ పవర్ రాస్తూ.. గుజరాత్ చంచార్వాడీ వాస్నాలో అదానీ గ్రూప్ నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ఎక్సిమ్ పవర్ ప్లాంటును ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని రాశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఈ ఫోటోలు బయటకు రాగానే రాహుల్ గాంధీ శరద్ పవార్ మధ్య వైరం మరోసారి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చదవండి: సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ

మరిన్ని వార్తలు