పిరికిపందలకు తలొగ్గేది లేదు: వీల్‌చైర్‌లోనే  రోడ్‌షో

14 Mar, 2021 14:27 IST|Sakshi

సాక్షి, కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ (66) చెప్పినట్టుగానే వీల్‌ చెయిర్‌లో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేది లేదనీ వీల్‌ చైర్‌లోనే ప్రజలను కలుస్తానని ప్రకటించిన మమత ఆదివారం కోల్‌కతాలో భారీ రోడ్‌షోకు హాజరయ్యారు.నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా గాయపడిన మమతా నాలుగు రోజుల తరువాత, తొలి బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యి కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.   

ఈ సందర్భంగా ధైర్యంగా పోరాటం కొనసాగిస్తామంటూ ఆమె ట్వీట్‌ చేశారు.  ఇంకా చాలా పెయిన్‌ ఉంది. కానీ  ప్రజల బాధలు  ఇంకా ఎక్కువగా  భావిస్తున్నారు.  తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో  చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ  పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.

దాడి జరగలేదు : ఈసీ
మరోవైపు సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిందన్న వాదనను ఈసీ తోసిపుచ్చింది. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంగా కారణంగానే ఆమె గాయపడ్డారని ఈసీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు