'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ

16 Nov, 2023 14:00 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జైపూర్‌లో ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ సంయుక్తంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని చూసిన రాహుల్.. చిరునవ్వులు కురిపించారు. మనం ఏకమయ్యాం.. రాష్ట్రంలో విజయం సాధిస్తాం అని అన్నారు. 

రాజస్థాన్‌లో సీనియర్ నాయకులు అశోక్‌ గహ్లోత్, సచిన్ పైలెట్‌కు మధ్య కొద్ది రోజులుగా విబేధాలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ఏర్పాటులో తన వర్గీయులకు అన్యాయం జరుగుతుందని సచిన్ పైలెట్ ఆరోపించారు. 2020లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో సచిన్‌ పైలెట్.. సీఎం అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు యత్నం చేశారు. ఆ తర్వాత ఆయన తన ఉపముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవులను కోల్పోయారు. పార్టీ కేంద్ర అధిష్ఠానం కల్పించుకుని అప్పటికి సద్దుమణిగేలా చేసింది. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. 

రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఇప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాన్ని తిరగరాస్తామని ధీమాతో ఉంది. అటు.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.

ఇదీ చదవండి: రాజకీయ విబేధాల నడుమ దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రీయా సూలే

మరిన్ని వార్తలు