చూస్తూ ఊరుకోం: మంత్రి సీదిరి అప్పలరాజు

16 Sep, 2022 06:50 IST|Sakshi

ఉత్తరాంధ్రపై ద్వేషంతో, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రతో విశాఖపై దండెత్తి వస్తే చూస్తూ ఊరుకోం. పాదయాత్ర పేరుతో రైతుల ముసుగులో టీడీపీ వారు లక్షల్లో వచ్చినా అంతకు రెట్టింపుగా వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు వారిని వెనక్కు పంపుతారు.

అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అంటూ కోర్టుల్లో వాదిస్తారా? అలాంటి ప్రాంతంలో కొన్ని గ్రామాల వారి కోసమే రాజధాని కట్టడానికి వెనుకబడ్డ వర్గాలు ఎందుకు అంగీకరించాలి? ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద 54 వేల ఎకరాల్లో రైతులకు 11 వేల ఎకరాలు ఇవ్వాలి. అభివృద్ధి కోసం 30 వేల ఎకరాలు ఖర్చవుతుంది.  ప్రభుత్వం చేతిలో 10 వేల ఎకరాలే ఉంటుంది. ఇది ఏ రకంగా త్యాగమవుతుంది’ అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు