ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, వస్తు లాభం

16 Sep, 2022 06:47 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.షష్ఠి ప.1.26 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: కృత్తిక ప.12.11 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.5.22 నుండి ఉ.7.05 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.04 వరకు, అమృతఘడియలు: ఉ.9.36 నుండి 11.18 వరకు;  రాహుకాలం ఉ.10.30 నుండి 12.00 వరకు; యమగండం ప.3.00 నుండి 4.30 వరకు; సూర్యోదయం 5.51; సూర్యాస్తమయం 6.01 

మేషం: పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయుల ఆదరణ, అనురాగం పెరుగుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరి ఊరట చెందుతారు.

మిథునం: ఏ పని చేపట్టినా నిరాశ తప్పదు. బంధువులే సమస్యలు సృష్టించవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

కన్య: పనుల్లో అవాంతరాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శ్రమాధిక్యం. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

తుల: మిత్రుల నుండి కొన్ని చిక్కులు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: బంధువులతో సత్సంబంధాలు. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు: రుణాలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. బంధువులతో తగాదాలు. మానసిక ఆందోళన.  మిత్రులతో సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుండి కీలక సందేశం. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు ఫలిస్తాయి.

మరిన్ని వార్తలు