‘టీడీపీతో కలవటం ఇక జరగదు’

30 May, 2021 05:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం కానీ, కలిసి పనిచేయడం కానీ జరగబోదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్‌ అన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ కృషి చేస్తుందని శనివారం ట్వీట్‌ చేశారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయాలన్న తన ఆకాంక్షను చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేశారని, అయితే.. నేతలు ఆ పార్టీని వీడకుండా ఉండేందుకే చంద్రబాబు ఇలాంటి మోసపూరిత ప్రచారం మొదలుపెట్టారని సునీల్‌  విమర్శించారు. తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మాదిరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు