వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై టీడీపీ, జనసేన నాయకుల దాడి 

4 Nov, 2021 04:45 IST|Sakshi

మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా పెదపట్నంలంక గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ కంచి దుర్గారావుపై బుధవారం దాడి జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ సుందరనీడి రాజేష్‌ కుమార్, జనసేనకు చెందిన ఎంపీటీసీ కొమ్ముల జగమయ్య, ఆ రెండు పారీ్టలకు చెందిన తాడి నర్సింహారావు, ముత్యాల బాబీలు మంగళవారం రాత్రి తనపై దాడి చేశారని బాధితుడు దుర్గారావు పేర్కొన్నారు.

జగనన్న విద్యాకానుక పథకం కోసం వేలి ముద్రలు వేసేందుకు నల్లి హేమమణి అనే మహిళను ఎక్కువ సమయం వేచి ఉండేలా ఎందుకు చేశావంటూ పాత కక్షల నేపథ్యంలో దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సచివాలయంలో బంధించి దాడి చేయడంతో పాటు, పెన్షన్‌ సొమ్ము రూ.14 వేలను వారు తీసుకుపోయారన్నారు. దాడిలో గాయపడ్డ దుర్గారావు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో పాటు, వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్‌ఐ జానీబాషా తెలిపారు. 

మరిన్ని వార్తలు