ఎమ్మెల్యే గద్దె స్వగ్రామంలో టీడీపీకి ఆశాభంగం 

23 Feb, 2021 09:31 IST|Sakshi

గన్నవరం(కృష్ణా జిల్లా): టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు స్వగ్రామమైన మండలంలోని అల్లాపురంలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయారు. ఆ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడైన సర్పంచ్‌ అభ్యర్థి డొక్కు సాంబశివ వెంకన్నబాబు 1,119 ఓట్లు సాధించి స్వతంత్ర అభ్యర్థి వీరాకుమారిపై 836 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ మద్దతు ఇచ్చిన చిక్కవరపు నాగమణి 40 ఓట్లతో మూడో స్థానంలో నిలవడంతో పాటు డిపాజిట్‌ను కోల్పోయారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పుట్టి పెరిగిన అల్లాపురంలో టీడీపీ ఘోర ఓటమి చెందడం పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు.
చదవండి:
గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం..   
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం

 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు